Kiran Kumar Reddy Resigns: కాంగ్రెస్‌కు మాజీ సీఎం గుడ్‌బై, ఏఐసీసీకి రాజీనామా లేఖ, కాషాయ గూటికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, త్వరలోనే కీలక బాధ్యతలు చేపట్టే ఛాన్స్
కాంగ్రెస్ కు రాజీనామా చేశారు (resigns congress). కొంతకాలం ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో (BJP) చేరనున్నారని సమాచారం.
Hyderabad, March 12: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar reddy).. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు (resigns congress). కొంతకాలం ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో (BJP) చేరనున్నారని సమాచారం. బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డికి ఎలాంటి పదవి ఇస్తారు, ఏ బాధ్యతలు అప్పగిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలంటూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి లేఖ రాశారు. కిరణ్ కుమార్ బీజేపీలో చేరతారంటూ ఇటీవల కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో ఆ కథనాలకు మరింత బలం చేకూరింది. ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ ఎంతో చురుకైన నాయకుడు అని, పార్టీలోకి వస్తే సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని అన్నారు. కిరణ్ వంటి నేత వస్తే, ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజన సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయంగా తెరమరుగయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు దూరమైన కిరణ్ కుమార్ రెడ్డి.. 2014 ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ హస్తం గూటికి చేరుకున్న కిరణ్ కు.. పార్టీ పగ్గాలు అప్పజెబుతారన్న ప్రచారం జరిగింది. కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ.. ఆయన కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదు.