TDP Protest: మోత మోగించిన టీడీపీ, చంద్రబాబు అరెస్టుపై 5 నిమిషాల పాటూ సౌండ్‌తో నిరసన, రాజమండ్రిలో బ్రాహ్మణీ, ఢిల్లీలో లోకేష్‌

చంద్రబాబు నాయుడి అరెస్టుకు (CBN Arrest) నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆ పార్టీ నేత నారా లోకేశ్ కార్యాలయంలో 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు బ్రాహ్మణితో పాటు పలువురు మహిళలు ఢమరుకం, డోలు వాయిస్తూ, విజిల్ వేస్తూ మోతమోగించారు.

TDP Protest (PIC@ TDP X)

Vijayawada, SEP 30: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కోడలు నారా బ్రాహ్మణి (Brahmani) సాయంత్రం మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడి అరెస్టుకు (CBN Arrest) నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆ పార్టీ నేత నారా లోకేశ్ కార్యాలయంలో 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు బ్రాహ్మణితో పాటు పలువురు మహిళలు ఢమరుకం, డోలు వాయిస్తూ, విజిల్ వేస్తూ మోతమోగించారు. నారా బ్రహ్మిణి (Brahmani) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. చంద్రబాబుకు న్యాయం కోసం కాదు.. ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని ఈ ప్రోగ్రాం చేస్తున్నామని తెలిపారు. న్యాయం జరగడం ఆలస్యం అవుతుంది కానీ కచ్చితంగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు త్వరలోనే బయటకు వస్తారని చెప్పారు.

 

 

 

మరోవైపు, ఢిల్లీలో గంట మోగిస్తూ లోకేశ్ (lokesh), టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణ రాజు, టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసి నినాదాలు చేశారు.

 

కాగా, పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు విజిల్స్, గంటలతో మోత మోగించారు. కర్నూలులో పార్టీ కార్యాలయం దగ్గర మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గంటలు, విజిల్స్ , తాళాలు, బూరలు, డప్పులు వాయిస్తూ టీడీపీ మోత మోగించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాల్గొన్నారు. విజయనగరంలోటీడీపీ పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అశోక్ గజపతిరాజు దంపతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.



సంబంధిత వార్తలు