Nellore Couple Murder Case: నెల్లూరు దంపతుల హత్య కేసు, క్యాంటిన్‌లో పనిచేసే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపిన వేదాయపాలెం పోలీసులు

జంట హత్యల కేసులను (Nellore Couple Murder Case) పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్‌లో సప్లయర్‌గా పని చేస్తున్న శివనే (handiwork of canteen worker)వారిని హత్య చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు.

Nellore Couple Murder Case (Photo-Video Grab)

Nellore, Sep 1: నెల్లూరు నగరంలో మూడు రోజుల క్రితం సంచలనం రేపిన దంపతులు హత్య కేసు మిస్టరీ (Andhra double murder case) వీడింది. జంట హత్యల కేసులను (Nellore Couple Murder Case) పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్‌లో సప్లయర్‌గా పని చేస్తున్న శివనే (handiwork of canteen worker)వారిని హత్య చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్న వాసురెడ్డి కృష్ణారావు, అతని భార్య సునీత ఈనెల 28వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. వారిని కిరాకతంగా చంపి ఇంట్లో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. దీంతో​, రంగంలోకి దిగిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో క్యాంటీన్‌లో అందరి ముందు మందలించారని.. శివ అనే వ్యక్తి కక్ష పెంచుకున్నట్లు గుర్తించారు. అతడే దంపతులిద్దరిని హత్య చేసినట్లు సమాచారం.

యువతిని బెడ్ రూంలోకి తీసుకెళ్లాడు, ఆ పని కోసం బట్టలు విప్పగానే షాక్, మిస్టరీ కేసును చేధించిన ఎంపీ పోలీసులు

కాగా, శనివారం రాత్రి భర్త కృష్ణారావు.. ఇంటి తాళం తీస్తుండగా ఆయనపై దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి నిద్రిస్తున్న సునీత తలపై కర్రతో కొట్టారు. దీంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. ఇక, కృష్ణారావు హత్యకు నిందితులు రెక్కీ కూడా నిర్వహించినట్టు సమాచారం. అయితే, శివతోపాటుగా ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.

మిస్టరీగా మారిన నెల్లూరు దంపతుల హత్య కేసు, నగదు కోసమే చంపారా లేక ముందస్తు ప్రణాళికతోనే హత్య చేశారా, దర్యాప్తును ముమ్మరం చేసిన సిటీ పోలీసులు

ప్రధాన నిందితుడు నెల్లూరు నగరంలోని రామకోటయ్య నగర్‌కు చెందిన మన్నూరు శివ కుమార్ (26). శివకుమార్‌ స్వస్థలం నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకూరు గ్రామం. మరో నిందితుడు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణానికి చెందిన చంద్రబాబు నగర్‌కు చెందిన కలగందల రామకృష్ణ (22).



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif