Coronavirus in AP: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా, తాజా కేసుల కంటే డిశ్చార్జ్ కేసులు ఎక్కువ, తాజాగా 5,653 మందికి కోవిడ్-19, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,97,699, యాక్టివ్ కేసులు 46,624 మాత్రమే

5,653 పాజిటివ్‌ కేసులు (Andhra Pradesh Coronavirus Cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,50,517 కి చేరింది. కోవిడ్‌ బాధితుల్లో తాజాగా 6,659 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,97,699. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో (Coronavirus In AP) యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 46,624. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 35 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 6194 కు చేరింది.

Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, Oct 11: రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 73,625 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,653 పాజిటివ్‌ కేసులు (Andhra Pradesh Coronavirus Cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,50,517 కి చేరింది. కోవిడ్‌ బాధితుల్లో తాజాగా 6,659 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,97,699. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో (Coronavirus In AP) యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 46,624. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 35 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 6194 కు చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. తాజా పరీక్షల్లో 38,619 ట్రూనాట్‌ పద్ధతిలో, 35,006 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశామని వెల్లడించింది.

ప్రకాశం జిల్లాలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంత, గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా 946 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా భీమవరంలో 101 కేసులు నమోదు కాగా.. జిల్లా కేంద్రం ఏలూరులో 46 కొత్త కేసులు బయటపడ్డాయి. శనివారం నాడు కరోనా వైరస్‎తో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం కేసులు 81 వేల 748 కేసులు నమోదు కాగా.. కరోనాతో మృతుల సంఖ్య 471కి చేరుకుంది.

అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి.., మాస్క్ లేకుంటే నో ఎంట్రీ

తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 706 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1.05,342కు చేరింది. శ్రీకాకుళం జిల్లాలో మరో 183 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 41,801కు చేరింది. విజయనగరం జిల్లాలో శనివారం 194మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 37,258కు చేరగా 193 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం జిల్లాలో 351కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇక్కడ మొత్తం మరణాల సంఖ్య 522కి చేరింది. కృష్ణాజిల్లాలో గడచిన 24గంటల్లో మరో 468మందికి వైరస్‌ సోకింది. జిల్లాలో మొత్తం పాజిటివ్‌లు 31,488కి చేరుకున్నాయి. నెల్లూరు జిల్లాలో తాజాగా 322 కేసులు రికార్డయ్యాయి.

కడప జిల్లాలో మరో 504మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 47,784కు చేరింది. గుంటూరు జిల్లాలో కొత్తగా 470 మందికి వైరస్‌ సోకింది. దీంతో జిల్లాలో కోవిడ్‌ బారిన పడినవారి సంఖ్య 61,030కి, మృతుల సంఖ్య 620కి చేరాయి. చిత్తూరు జిల్లాలో 706 కొత్త కేసులు వెలుగు చూశాయి. జిల్లాలో కొవిడ్‌ మరణాల సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికంగా 701కి చేరింది. కర్నూలు జిల్లాలో శనివారం 119 కేసులు నమోదయ్యాయి. విశాఖలో కొత్తగా 289మందికి కరోనా సోకింది.