Ashwini Vaishnaw About New Rail Projects: తెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్వే లైన్లు, బెంగాల్ టూ వరంగల్, భద్రాచాలం టూ తూర్పుగోదావరి కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు, ఐదేళ్లలో పూర్తి చేస్తామన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

బెంగాల్‌లోని అసోన్‌సోల్ నుండి వరంగల్ వరకు అలాగే భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ, తెలంగాణతో పాటు బిహార్, ఝార్ఖండ్ కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను తెలిపారు.

new railway projects for Telugu states says railway minister Ashwini Vaishnaw(X)

Delhi, Aug 10:  తెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్వే కారిడార్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్. బెంగాల్‌లోని అసోన్‌సోల్ నుండి వరంగల్ వరకు అలాగే భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ, తెలంగాణతో పాటు బిహార్, ఝార్ఖండ్ కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను తెలిపారు.

రాబోయే ఐదేళ్లలో కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. రూ.7383 కోట్లతో మల్కాన్‌గిరి నుండి పాండురంగాపురం వయా భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు కొత్త రైల్వే లైన్‌కు శ్రీకారం చుట్టామన్నారు. బొగ్గు రవాణాకు ఈ కారిడార్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అలాగే గోదావరి నదిపై బ్రిడ్జిని నిర్మిస్తామని వెల్లడించారు.

ఏపీలో 85.5 కిలో మీటర్లు, తెలంగాణలో 19 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం చేపడుతున్నాం అన్నారు. తుపాను వంటి విపత్తుల సమయంలో ఈ లైన్‌లో రైల్వేలు నడుపుతామని తెలిపారు. త్వరలో జైలుకు కేటీఆర్, బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం వార్తలు పుకార్లేనన్న బండి సంజయ్‌

ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో బొగ్గును నేరుగా తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు చేరుకుంటుందని చెప్పుకొచ్చారు. ఈ కారిడార్ ద్వారా 500-700 కి.మీ దూరం తగ్గుతుందని తెలిపారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం మీదుగా ఈ లైన్ సాగుతుందని చెప్పారు.