Hyd, Aug 10: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు కేంద్రమంత్రి బండి సంజయ్. మీడియాతో మాట్లాడిన కేటీఆర్...కేటీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి గురించి అందరికీ తెలుసని తెలిపారు.
బీఆర్ఎస్‌తో బీజేపీ చర్చలు జరిపిందన్న ప్రచారంలో నిజం లేదని దానిని నమ్మవద్దని కోరారు. తనతో పాటు బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించారని, జైల్లో వేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అని, కవిత బెయిల్ వస్తుందనడానికి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సే పార్టీ అని వమిర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్‌కు మరో షాక్, కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, త్వరలోనే చేరిక ఉండే అవకాశం?, 11వ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి?
బీఆర్ఎస్ పార్టీతో సంప్రదింపులు ఏమీ లేవని తాను పేపర్లలోనే చదివానని చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అలాంటిది ఏదైనా ఉంటే ముందు మీడియాకే చెబుతానని తేల్చిచెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై పార్టీ అధిష్టానం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నాం అని.... అధ్యక్ష మార్పు అంశం, ఎన్నికల సన్నద్ధతకు సంబంధం లేదని అన్నారు.