YS Jagan Attack Case: కోడికత్తి కేసులో జగన్ విచారణకు హాజరు కావాల్సిందే, ఆదేశాలు జారీ చేసిన ఎన్‌ఐఏ కోర్టు, విచారణ ఏప్రిల్‌ 10కి వాయిదా

తాజాగా ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో(NIA court ) మంగళవారం విచారణ జరిగింది.

CM YS Jagan (Photo-Twitter/AP CMO)

Vjy, Mar 14: గత ఎన్నికల సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి (YS Jagan Attack Case) జరగడం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో(NIA court ) మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు అథారిటీ కమాండర్‌ దినేష్‌ను న్యాయస్థానం విచారించింది. కేసుకు సంబంధించిన కోడికత్తి, మరో చిన్న కత్తి, పర్సు, సెల్‌ఫోన్‌ను పోలీసులు కోర్టుకు అప్పగించారు.

తెలుగు ఫ్లాగ్ అంటే తెలుగు జాతి, ముందు తెలుగోడి సత్తా తెలుసుకుని మాట్లాడు, ఆద్నాన్ సమీపై విరుచుకుపడిన వైసీపీ మంత్రులు

అనంతరం విచారణను ధర్మాసనం వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఏప్రిల్‌ 10న విచారణకు హాజరుకావాలని ముఖ్యమంత్రి జగన్‌ను ఎన్‌ఐఏ కోర్టు ఆదేశించింది. సీఎంతో పాటు ఆయన పీఏ కె.నాగేశ్వర్‌రెడ్డి కూడా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.గత వారం కూడా విశాఖపట్నం విమానాశ్రయం (Visakhapatnam Airport)లో నాటి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy)పై కోడికత్తి (Kodi Kathi)తో జరిగిన హత్యాయత్నం కేసులో విచారణ ఎన్‌ఐఏ కోర్టులో జరిగింది.

నాటు నాటు సాంగ్.. సీఎం జగన్ తెలుగు ఫ్లాగ్ ట్వీట్‌పై అద్నాన్ సమీ విమర్శలు, మధ్యలో నీకేంటి నొప్పి అంటూ విరుచుకుపడుతున్న నెటిజన్లు

విచారణలో భాగంగా సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ దినేష్‌కుమార్‌ను సాక్షిగా విచారించారు. ఘటన జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆయనే కావడంతో విచారించారు. దినేష్‌ కుమార్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా న్యాయమూర్తి విచారించారు.



సంబంధిత వార్తలు

Farmers Protest: కనీస మద్దతు ధరపై రైతుల పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కిసాన్ నాయకుడికి తక్షణ వైద్య సహాయం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన సుప్రీంకోర్టు

Manmohan Singh Last Rites On Saturday: శనివారం మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు.. ఏడు రోజులు సంతాపదినాలు.. ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకం సగానికి అవనతం

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు