Night Curfew Extended in AP: ఏపీలో సెప్టెంబర్ 30 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు, ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ, మాస్క్ లేకుంటే భారీ జరిమానా
రాత్రి పూట కర్ఫ్యూ ఆంక్షల్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ (Night Curfew Extended in AP) వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు (Night curfew in A.P) అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
Amaravati, Sep 18: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి పూట కర్ఫ్యూ ఆంక్షల్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ (Night Curfew Extended in AP) వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు (Night curfew in A.P) అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం 2005, భారత శిక్షా స్మృతి సెక్షన్ 188, ఇతర నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు.
అలాగే పెళ్లిళ్లకు 150 మందికి మాత్రమే అనుమతించాలని సీఎం జగన్ ఆదేశించారు. తెల్లవారు జామున జరిగే పెళ్లిళ్లలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టంచేశారు. కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం జగన్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్కులు లేని వారిని అనుమతిస్తే జరిమానా విధిస్తున్నారు.
జరిమానాని అక్కడి పరిస్థితుల ఆధారంగా విధిస్తారు. అలాగే 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థను మూసివేస్తారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.