AP Night Curfew Extended: ఏపీలో ఈనెల 21వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో కర్ప్యూ

ఈనెల 21వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూ పొడిగిస్తూ (AP Night Curfew Extended) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh Partial curfew (Photo: PTI)

Amaravati, August 15: ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను పొడిగించారు. ఈనెల 21వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూ పొడిగిస్తూ (AP Night Curfew Extended) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుంది. ఏపీలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు స్థిరంగా ఉంటున్నాయి. దీనిపై నిన్న ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. అనంతరం రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదివారం జీవో జారీ చేసింది.

ఏపీలో గడిచిన 24 గంటల్లో 69,088 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,535 కరోనా కేసులు (Coronavirus in Andhra Pradesh) నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావంతో 16 మంది మృతి చెందారు. తాజాగా 2,075 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఏపీలో కరోనా కట్టడి చర్యలు భేష్, ప్రభుత్వ చర్యల వల్ల కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపిన ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా

ఇక రాష్ర్టంలో ఇప్పటి వరకు 2,55,95,949 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,60,350 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి బారినపడి మొత్తం 13,631 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 పాజిటివ్‌ కేసులు (Active Cases) ఉన్నాయి. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 19,92,191 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.