AP & TS Assembly Seats Row: నియోజకవర్గాల పెంపు, ఏపీలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలు, అయితే 2026 జనాభా లెక్కల వరకు వేచి చూడాలని తెలిపిన కేంద్రం

అసెంబ్లీ స్థానాలు (assembly seats) పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. జీవీఎల్‌ (GVL) ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. నియోజకవర్గాల పెంపుపై 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని సూచించారు.

Union Minister of State for Home Nityanand Rai (File Photo/ANI)

Amaravati, July 27: ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీ స్థానాలు (assembly seats) పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. జీవీఎల్‌ (GVL) ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. నియోజకవర్గాల పెంపుపై 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని సూచించారు. అంతవరకు సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 15కు లోబడి.. ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయని కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ సమాధానం ఇచ్చారు.

ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపు జరగాలంటే 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని కేంద్రం (Center) తెలిపింది. కిందటి ఏడాది ఎంపీ రేవంత్ రెడ్డి సైతం ఇదే ప్రశ్నకు అడగ్గా.. ఇదే మంత్రి.. ఇదే సమాధానం ఇచ్చారు.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజ‌య్ సింగ్‌కు వేటు ప‌డింది. రాజ్య‌స‌భ నుంచి వారం పాటు ఆయ‌న్ను స‌స్పెండ్ చేశారు. నినాదాలు చేస్తూ, పేప‌ర్ల‌ను చించివేస్తూ, చైర్‌పై విసిరేశార‌ని రాజ్యస‌భ డిప్యూటీ చైర్మెన్ హ‌రివంశ్ అన్నారు. మంగ‌ళ‌వారం 19 మంది ఎంపీల‌ను రాజ్య‌స‌భ నుంచి వారం పాటు స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే.

దేశంలో కొత్తగా 18,313 కరోనా కేసులు, గత 24 గంటల్లో 57 మంది మృతి, మరో 1,45,026 కేసులు యాక్టివ్‌

ప్ర‌స్తుతం వ‌ర్షాకాల స‌మావేశాల నుంచి మొత్తం 24 మంది ఎంపీలు స‌స్పెండ్ అయ్యారు. లోక్‌స‌భ‌కు చెందిన న‌లుగుర్ని ఎంపీలు కూడా స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. ధ‌ర‌ల పెరుగుద‌ల‌, జీఎస్టీ వంటి అంశాల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్ష ఎంపీలు ఉభ‌య‌స‌భ‌ల్లో ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఇవాళ లోక్‌స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.