IPL Auction 2025 Live

Oxygen Shortage in Hindupur: హిందూపురంలో ఆక్సిజన్ అందక ఎనిమిది మంది మృతి, ఆందోళన చేపట్టిన మృతుల బంధువులు, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు, ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ

తాజాగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక (Oxygen Shortage in Hindupur) ఎనిమిది మంది మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయారంటూ బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. కాగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని ( Hindupur Government Hospital) 6-కెఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఖాళీ కావడంతో ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎనిమిది మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.

Oxygen cylinders | representational Image (Photo Credits: PTI)

Hindupur, May 3: ఆక్సిజన్ కొరత రోగుల ప్రాణాలను తీసేస్తోంది. తాజాగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక (Oxygen Shortage in Hindupur) ఎనిమిది మంది మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయారంటూ బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. కాగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని ( Hindupur Government Hospital) 6-కెఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఖాళీ కావడంతో ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న హిందూపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలా మడ్డిలేటి తన సిబ్బందితో కలిసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆక్సిజన్ సరఫరా అకస్మాత్తుగా ఉదయం 5.40 గంటలకు ఆగిపోయింది. బల్క్ సిలిండర్లను అనుసంధానించడానికి ఎవరూ లేరు. మేము పరిగెత్తి సిలిండర్లను తీసుకొని వాటిని మేమే కనెక్ట్ చేసుకోవలసి వచ్చింది. ఈ సమయంలో ఎనిమిది మంది రోగులు మరణించారని అక్కడ ఉన్న అటెండెంట్లు పోలీసులకు తెలిపారు.

140 బల్క్ సిలిండర్లతో ఆక్సిజన్ సరఫరా కోసం తాము అన్ని ఏర్పాట్లు చేశామని గ్రిడ్‌కు అనుసంధానించామని ఆక్సిజన్ నోడల్ ఆఫీసర్, జిల్లా అటవీ అధికారి ఆర్.జగన్నాథ్ సింగ్‌ చెప్పారు. అయితే గత రాత్రి 6-కెఎల్ ట్యాంక్లో 1.4 కిలోల ఎల్ఎమ్ఓ మాత్రమే ఉన్నందున ఆక్సిజన్ కొరత ఉందని మాకు తెలుసు. ఆసుపత్రి ప్రాంగణంలో మాకు ఆక్సిజన్ పర్యవేక్షణ బృందం ఉంది మరియు వీటన్నింటినీ వారు చూసుకుంటున్నారు, ”అని ఆయన అన్నారు.మరో బల్క్ కంటైనర్ ఉదయం 8 గంటలకు వచ్చింది. మరోసారి 6-కెఎల్ ఎల్ఎమ్ఓ ట్యాంక్ నింపింది. అక్కడ ఎటువంటి కొరత లేదని ఆయన వివరించారు.

ఏపీలో మే 5 నుంచి డే కర్ప్యూ, రెండు వారాల పాటు కర్ఫ్యూ అమల్లోకి, ఉదయం 6 నుంచి 12 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలు

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభాకర్ మాట్లాడుతూ, తగినంత సంఖ్యలో బల్క్ సిలిండర్లు ఉన్నాయని, ఎల్‌ఎంఓ ట్యాంక్ నుంచి సరఫరా ఆగిపోయినప్పుడు అవి కనెక్ట్ అయ్యాయని చెప్పారు. "గత రెండు రోజులుగా పేషెంట్ యొక్క SPO2 saturation levels తక్కువగా ఉన్నాయి. ఆ సమస్యల కారణంగానే ఎనిమిది మంది రోగులు మరణించారు, కాని ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల కాదు" అని డాక్టర్ ప్రభాకర్ తెలిపారు.

ఇక అనంతపురం జనరల్ ఆసుపత్రిలో ఒక్కరోజే 15 మంది మృత్యువాత పడడం తీవ్ర కలకలం రేపుతోంది. చనిపోయిన వారిలో ఒకరు బ్రెయిన్ డెడ్ అని, మిగతా వారు కరోనా రోగులని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వివరించారు. అనంతపురం జనరల్ ఆసుపత్రిలో రెండ్రోజులుగా ఆక్సిజన్ సమస్య ఏర్పడిందని, ఆక్సిజన్ సరఫరాలో సమస్య వల్లే కరోనా రోగులు మృతి చెందినట్టు వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ గంధం చంద్రుడు మాత్రం వారు కొవిడ్ తీవ్రత కారణంగానే మరణించినట్టు చెబుతున్నారు.

ఆక్సిజన్ అందక కర్ణాటకలో 24 మంది మృత్యువాత, విచారం వ్యక్తం చేసిన సీఎం యడ్డ్యూరప్ప, మరణాలపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి సురేష్‌కుమార్‌

ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో ఒక్కరోజే పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాల పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున సాయం చేసి ఆదుకోవాలని అన్నారు.



సంబంధిత వార్తలు

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్

RBI Governor Shaktikanta Das in Hospital: ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కు అస్వస్థత.. చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స.. ఛాతీలో నొప్పి కారణంగానేనంటూ మీడియాలో కథనాలు

Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు