AP Panchayat Elections: మూడో దశలోనూ వైసీపీ మద్దతుదారులదే హవా, తొగరాం సర్పంచ్‌గా విజయం సాధించిన ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ, రాష్ట్రవ్యాప్తంగా 80.64 శాతం పోలింగ్‌ నమోదు

ఒకట్రెండ్లు చోట్ల చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్‌ ప్రశాంతంగా (AP Panchayat Elections) జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 80.64 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం నమోదుకాగా.. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 69.20 శాతం నమోదైంది.

AP Local Body Elections 2021 (Photo-PTI)

Amaravati, Feb 17: ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఒకట్రెండ్లు చోట్ల చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్‌ ప్రశాంతంగా (AP Panchayat Elections) జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 80.64 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం నమోదుకాగా.. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 69.20 శాతం నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటికే పలు పంచాయతీల్లో (AP Panchayat elections 2021) విజేతలెవరో తేలిపోయింది. రాత్రి 10 గంటల వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు కొన్ని చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 2, ఇతరులు 23 చోట్ల గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం సర్పంచ్ గా ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ బరిలోకి దిగారు. ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై ఆమె 510 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఫలితం వెలువడిన వెంటనే గ్రామంలోని వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. వాణిశ్రీకి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమెను గ్రామంలో ఊరేగించారు. ఇదిలా ుంటే చంద్రబాబు నియోజక వర్గం కుప్పంలో కూడా టీడీపీకి ఎదురుగాలి వీచినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ముగిసిన మూడో దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొదలైన ఓట్ల లెక్కింపు, ఓటువేసేందుకు వెళ్తున్న జీపు బోల్తా, పలువురికి గాయాలు

13 జిల్లాల్లోని 2,640 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. 7,757 మంది సర్పంచ్ అభ్యర్థులు.. 19,553 వార్డులకు 43,162 మంది పోటీ పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,851 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ సరళిని ఎస్ఈసీ కార్యాలయం నుంచి అధికారులు పర్యవేక్షించారు. ఎస్ఈసీ, డీజీపీ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహించారు.

భారీగా నమోదైన ఏకగ్రీవాలు, నాలుగు విడతల్లో 2,192 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం, నాలుగవ విడతలో 549 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నిక

మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తైన వెంటనే నాలుగో విడత పంచాయతీ ఎన్నికల వివరాలను ఎస్ఈసీ విడుదల చేసింది. నాలుగో విడతలో 3,297 పంచాయతీల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉండగా.. అందులో 553 పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ప్రకటించింది. మిగిలిన 2744 పంచాయతీల్లో ఈ నెల 21న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ గ్రామాల్లో 7475మంది సర్పంచ్ బరిలో ఉన్నారు. 33,435 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 10,921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 22,422 వార్డుల్లో పోలింగ్‌ పోలింగ్ జరుగుతంది.

మూడో విడతలో పోలింగ్ శాతం

శ్రీకాకుళం జిల్లా – 80.13 శాతం

విజయనగరం జిల్లా – 87.09 శాతం

విశాఖపట్నం జిల్లా – 69.28 శాతం

తూర్పగోదావరి జిల్లా – 74.80

పశ్చిమగోదావరి జిల్లా 82.73 శాతం

కృష్ణా జిల్లా – 84.65 శాతం

గుంటూరు జిల్లా – 84.80 శాతం

ప్రకాశం జిల్లా – 82.42 శాతం

నెల్లూరు జిల్లా – 83.15 శాతం

చిత్తూరు జిల్లా – 83.04 శాతం

వైఎస్ఆర్ కడప జిల్లా – 72.85

కర్నూలు జిల్లా – 83.10

అనంతపురం జిల్లా – 80.29 శాతం