AP Gram Panchayat Elections 2021: భారీగా నమోదైన ఏకగ్రీవాలు, నాలుగు విడతల్లో 2,192 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం, నాలుగవ విడతలో 549 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నిక
EC releases final list of voters in Andhra Pradesh (Photo-PTI)

Amaravati, Feb 17: ఏపీ రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లో 549 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా (Unanimous) ఎన్నికయ్యారు. దీంతో నాలుగు దశల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌ల సంఖ్య (AP Gram Panchayat Elections 2021) 2,192కు చేరింది. తుది దశ ఎన్నికల కోసం ఈనెల 10న నోటిఫికేషన్‌ జారీచేసి 12వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.

2,750 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు (AP Gram Panchayat Elections) ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఈ నెల 21న పోలింగ్‌ నిర్వహించనున్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తారు. వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటించిన అనంతరం వెంటనే ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు (AP Local Body Polls) ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిచేస్తే పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్చి 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు, 75 పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. 3,127 పోలింగ్‌ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ 7,245 కేంద్రాలలో పోలింగ్‌ ప్రక్రియను ఎన్నికల అధికారులు వెబ్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

ఊపందుకున్న మూడో దశ పోలింగ్, ఉదయం ఆరున్నర గంటలకే ప్రారంభం, మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ, 8.30 గంటల వరకు 11.74 శాతంగా నమోదు

ఏపీలో పంచాయితీ ఎన్నికల సమరం ముగియగానే మరో ఎన్నికల సమరానికి ఏపీ ఎస్‌ఈసీ (AP SEC) సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసింది. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే మార్చి 13న రీపోలింగ్ ఉంటుందని ఎస్‌ఈసీ పేర్కొంది. అలాగే మార్చి 14 ఓట్ల లెక్కింపు జరుగనుంది. సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తామని ఎస్ఈసీ తెలిపింది.

మార్చి 2 నుంచి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల తర్వాత అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేస్తారు. 75పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్ (AP Municipal Elections Schedule) నిర్వహిస్తారు.

గతేడాది మార్చి 11, 12న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు గ్రేటర్ విశాఖ, విజయనగరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం కార్పోరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు కేసుల కారణంగా నెల్లూరు, రాజమండ్రిలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.