Amaravati, Feb 17: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు (AP Local Body Polls) ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిచేస్తే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. 3,127 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ 7,245 కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు వెబ్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోల్ శాతం 8.30 గంటల వరకు 11.74 శాతంగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి గ్రామంలో 50 ఏళ్ల తర్వాత పోలింగ్ బూత్‌లకు వెళ్లి గ్రామ ప్రజలు ఓటు వేశారు. ఇన్ని సంవత్సరాలు తర్వాత ఓటు వేయడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం 8:30 గంటల వరకు జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి.
►శ్రీకాకుళం- 12.87 శాతం
►విజయనగరం- 15.3 శాతం
►విశాఖపట్నం- 13.75 శాతం
►తూర్పు గోదావరి- 12.6 శాతం
►పశ్చిమ గోదావరి- 11.72 శాతం
►కృష్ణా - 8.14 శాతం
►గుంటూరు 18.83 శాతం
►ప్రకాశం 8.04 శాతం
►నెల్లూరు 9.1 శాతం
►చిత్తూరు 9.34 శాతం
►వైఎస్ఆర్ కడప 7.5 శాతం
►కర్నూలు 15.39 శాతం
►అనంతపురం 9.9 శాతం