Pawan Met PM Modi : ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ.. ఎనిమిదేళ్ల తర్వాత ప్రధానిని కలవడం ఇదే ప్రథమం అన్న పవన్.. ప్రధాని మోదీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని వెల్లడి.. ప్రెస్ మీట్ పూర్తి వీడియో ఇదిగో..

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత వీరిరువురు సమావేశమయ్యారు. వాస్తవానికి ప్రధానిని మొదట బీజేపీ కోర్ కమిటీ సభ్యులు కలవాల్సి ఉంది. ఆ తర్వాతే పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే ప్రధాని పర్యటన గంటన్నర ఆలస్యం కావడంతో, మోదీని మొదట పవన్ కల్యాణ్ కలిశారు.

Pawan Kalyan (Photo-Video Grab)

Visakhapatnam, Nov 12: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాజకీయాల్లో (Politics) ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విశాఖ పర్యటనకు (Visakhapatnam) వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో జనసేన పార్టీ (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భేటీ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత వీరిరువురు సమావేశమయ్యారు. వాస్తవానికి ప్రధానిని మొదట బీజేపీ కోర్ కమిటీ సభ్యులు కలవాల్సి ఉంది. ఆ తర్వాతే పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే ప్రధాని పర్యటన గంటన్నర ఆలస్యం కావడంతో, మోదీని మొదట పవన్ కల్యాణ్ కలిశారు. ఈ కీలక సమావేశానికి పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఈ భేటీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రధానిని కలవడం ఇదే ప్రథమం అని వెల్లడించారు.

21 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన కుమార్తె.. ఎవరూ పెళ్ళికి ముందుకు రాకపోవడంతో తండ్రి సంచలన నిర్ణయం.. శ్రీకృష్ణ భగవానుడికి కుమార్తెను ఇచ్చి వివాహం.. హాజరైన బంధుమిత్రులు.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘటన.. వీడియో ఇదిగో!

ప్రధాని మోదీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని, తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండాలని అభిలషించారని పవన్ వివరించారు. ఏపీకి భవిష్యత్తులో మంచి రోజులు తెచ్చే దిశగా ఈ భేటీ ఫలప్రదం అయిందని భావిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement