‘NTR Bharosa’ Pension Scheme: రూ.7000కు బదులు రూ.6,500 పెన్షన్, రూ. 500 నొక్కేస్తున్నారని మహిళ చెబుతున్న వీడియో వైరల్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు. తాజాగా కొన్ని చోట్ల రూ.7000కు బదులు రూ.6,500 ఇస్తున్నారని మహిళలు చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది.అయితే వీడియో ఎక్కడ తీసారనే దానిపై అధికారిక సమాచారం లేదు. కాగా ప్రభుత్వం పెన్షన్ రూ.4 వేలతో పాటు, ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు రూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు నగదును అందజేస్తున్న సంగతి విదితమే. వీడియో ఇదిగో, వృద్ధురాలి కాళ్లను పాలతో కడిగి రూ.7,000 పెన్షన్ అందించిన బుద్ధా వెంకన్న
Here's Videos