Kodali Nani On TDP Attacks: పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తామన్న మాజీ మంత్రి కొడాలి నాని, టీడీపీ దాడులపై సంచనల వ్యాఖ్యలు
స్వయంగా పోలీసుల సమక్షంలోనే టీడీపీ వాళ్లు దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం లేదని అన్నారు.
Machilipatnam, June0 08: వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నారని మాజీ మంత్రులు పేర్ని నాని(Perni nani), కొడాలి నాని (Kodali Nani) అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని నివాసంలో ఇవాళ పలువురు వైసీపీ నేతలు సమావేశమై కార్యకర్తల మీద జరుగుతున్న దాడులపై చర్చించారు. ఈ సందర్భంగా పేర్ని నాని, కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నాలుగు రోజుల నుంచి జిల్లాలో టీడీపీ (TDP Attacks) దాడులకు పాల్పడుతోందని తెలిపారు. స్వయంగా పోలీసుల సమక్షంలోనే టీడీపీ వాళ్లు దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం లేదని అన్నారు.
రెండు రోజుల్లో కృష్ణ జిల్లా ఎస్పీని కలుస్తామని తెలిపారు. జిల్లా వైఎస్సార్సీపీ మాజీ శాసన సభ్యులు అందరం కలిసి పూర్తి వివరాలు అందచేసి రక్షణ కోరతామని అన్నారు. పోలీసుల తీరు ఇలాగే ఉంటే తాము హైకోర్టులో ప్రైవైట్ కేసు వేసి న్యాయ పరంగా ముందుకు వెళతామని చెప్పారు. కాగా, టీడీపీ దాడులు చేస్తోందంటూ ఇప్పటికే వైసీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దాడులకు తెగబడిన వారిపై చర్యలు తీసుకోవాలని, మరోసారి దాడులు జరగకుండా చూడాలని వారు కోరారు.