Police Commemoration Day 2021: తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దు, అసాంఘీక శక్తులను ఏరి పారేయండి, సీఎంని బూతులు తిట్టే స్థాయికి వచ్చారు, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్
ఏపీలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి (Police Commemoration Day 2021) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకుని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు.
Amaravati, Oct 21: ఏపీలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి (Police Commemoration Day 2021) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకుని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. గత 62 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే.. మన రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. ఈ అమరవీరులందరికి నేడు రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి (CM YS Jagan Pays Homage) ఘటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అన్నారు.
పోలీసుల బాగోగుల గురించి ఆలోచించి.. దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి వీక్లీఆఫ్ ప్రకటించిన ప్రభుత్వం మనదే అని తెలుపుతున్నాను. కోవిడ్ కారణంగా దీన్ని అమలు చేయలేకపోయాం. ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గింది కనుక నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టనున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు. పోలీసు శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతాం. కోవిడ్ వల్ల చనిపోయిన పోలీసులకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశాం. కరోనా బారిన పడిన పోలీసులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాం. హోంగార్డుల ప్రత్యేక వేతనాన్ని కూడా పెంచాం. గత ప్రభుత్వం పోలీసుశాఖకు బకాయి పెట్టిన 1500 కోట్ల రూపాయలు విడుదల చేశాం’’ అని సీఎం జగన్ తెలిపారు.
నేరాల్లో కొత్త కోణం కనిపిస్తోంది. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.. ఆలయాల రథాలను తగలబెట్టారు. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు.. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకున్నారు. చివరకు ముఖ్యమంత్రిని కూడా దారుణమైన బూతులు తిడుతున్నారు. ఇది కరెక్టేనా.. ఇలా తిట్టడం కరెక్టేనా.. ఆలోచించండి. సీఎంను అభిమానించే వాళ్లు తిరగబడాలి.. తద్వారా గొడవలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారు. ఇది అనైతికం.. అధర్మం.. పచ్చి అబద్ధం’’ అన్నారు .
రాష్ట్రంలో గత రెండున్నరేళ్లలో కొత్త తరహా నేరగాళ్లను చూస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఈ కొత్త నేరగాళ్లు ఎలాంటి పనులు చేస్తున్నారో మనందరం చూస్తున్నామని చెప్పారు. అధికారం దక్కలేదని చీకట్లో రథాలను తగులబెట్టారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టుడుతున్నారని అన్నారు. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేస్తున్నారని చెప్పారు. చివరకు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు కూడా దక్కకుండా చేస్తున్నారని అన్నారు.
అబద్ధాలనే వార్తాపత్రికలకు ఇస్తున్నారని, ఛానళ్లలో అబద్ధాలనే డిబేట్లుగా పెట్టిస్తున్నారని జగన్ మండిపడ్డారు. చివరకు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి కూడా బోసడీకే అని తిట్టారని... బోసడీకే అంటే 'లంజాకొడుకు' అని అర్థమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని కూడా దుర్భాషలాడుతున్నారని అన్నారు. ఇదంతా సమంజసమేనా అనే విషయం గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ నాయకుల రూపంలో ఉన్న అసాంఘికశక్తులను మనం చూస్తున్నామని చెప్పారు. తమకు గిట్టని వ్యక్తి సీఎం అయ్యాడనే అక్కసుతో ఇదంతా చేస్తున్నారని అన్నారు.
ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పట్టంకట్టారని... ఇక ఎప్పటికీ అధికారంలోకి రాలేమనే భయంతో ప్రభుత్వంపై అబద్ధాలు చెపుతూ, గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని జగన్ చెప్పారు. వీరు టార్గెట్ చేస్తున్నది కేవలం సీఎం, ప్రభుత్వాన్నే కాదని... రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర పరువు, ప్రతిష్టలను దిగజార్చుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి డ్రగ్స్ కు బానిస అనే విధంగా కామెంట్లు చేస్తున్నారని చెప్పారు. ఇంటెలిజెన్స్, విజయవాడ సీపీ డ్రగ్స్ కు ఏపీతో సంబంధం లేదని చెప్పినా... ఒక కుట్ర ప్రకారం బుదర చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
శాంతిభద్రతలు అనేవి ప్రభుత్వానికి టాప్ మోస్ట్ ప్రయారిటీ అని... వీటిని కాపాడే క్రమంలో సీఎం సహా ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని జగన్ పోలీసులకు చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అతి ముఖ్యమైన విషయం. శాంతిభద్రతలను కాపాడే క్రమంలో ఏమాత్రం రాజీ పడొద్దని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని... తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులకు వారి విధులను గుర్తు చేస్తున్నాని చెప్పారు. మహిళలు, చిన్నపిల్లలు, బడుగు, బలహీన వర్గాల విషయంలో రాజీ పడొద్దు. రాజకీయ నేతల్లో కూడా అసాంఘిక శక్తులను చూస్తున్నాం. అలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించొద్దు’’ అని సీఎం జగన్ సూచించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)