Post-Poll Violence in AP: వీడియోలు ఇవిగో, వైసీపీ నేతల ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో టీడీపీ శ్రేణులు దాడులు, అడ్డువచ్చినా పోలీసు వాహనాలను సైతం..

వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి.

Post-Poll Violence in Andhra Pradesh: TDP activists tried to attack the houses of former Minister Kodali Nani and former Gannavaram MLA Vallabhaneni Vamsi Mohan Watch Videos

Vjy, June 7: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత హింస కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. తెలుగు యువతకు చెందిన కొందరు నాయకులు.. శుక్రవారం మధ్యాహ్నాం కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు. ఆపై టపాసులు కాల్చి నానా హంగామా చేశారు. ఇంటిలోకి చొచ్చుకునిపోయే ప్రయత్నమూ చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు.. వాళ్లను అడ్డుకుని అక్కడి నుంచి పంపించే యత్నం చేశారు. ఏపీలో దాడులపై స్పందించిన చంద్రబాబు, వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని పిలుపు

విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైనా దాడి జరిగింది. వంశీ ఉంటున్న ఫ్లోర్‌ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్‌లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆపై పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టి.. చుట్టూ కంచె ఏర్పాటు చేశారు.సీఆర్పీఎఫ్‌, పోలీస్‌ బలగాలు మోహరించినప్పటికీ టీడీపీ యువత దాడులను ఆపలేదు. ఏసీపీ వాహనంతో పాటు మరో వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి టీడీపీ రౌడీలను చెదరగొట్టాయి.

Here's Videos

విజయవాడలో గత అర్ధరాత్రి రాజీవ్ నగర్‌లోని వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి శివారెడ్డి ఇంటి పై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో ఆయన కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఇంటి బయట ఫర్నీచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు.ఈ ఉదయం టీడీపీ నేతల దాడిపై నున్న పోలీస్ స్టేషన్‌లో పెద్దిరెడ్డి శివారెడ్డి ఫిర్యాదు చేశారు. రాజమండ్రిలో మోరంపూడి ఫ్లై ఓవర్‌ శిలాఫలకం ధ్వంసం చేశాయి టీడీపీ శ్రేణులు. సమాచారం అందుకున్న మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో.. ఇలాంటి ఘటనలు సరికాదని టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి హితవు పలికారు.