IPL Auction 2025 Live

Jagan on Post-Poll Violence in AP: చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు, జగన్ సంచలన ట్వీట్, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆవేదన

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి

Jagan Mohan Reddy

ఏపీలో ఎన్నికల తరువాత వైసీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీనుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది.  వీడియోలు ఇవిగో, వైసీపీ నేతల ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో టీడీపీ శ్రేణులు దాడులు, అడ్డువచ్చినా పోలీసు వాహనాలను సైతం..

ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది.  వీడియో ఇదిగో, వల్లభనేని వంశీ ఇంటిపై కర్రలతో టీడీపీ శ్రేణులు దాడి, టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టిన ప్రత్యేక బలగాలు

Here's Tweet

గౌరవ గవర్నర్ గారు ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెమ్మలకు వైసీపీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నానని తెలిపారు.



సంబంధిత వార్తలు