President Kovind Chittoor Tour: మదనపల్లె సత్సంగ్ ఆశ్రమానికి రాష్ట్రపతి కోవింద్, రేణి గుంట ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన ఏపీ సీఎం వైయస్ జగన్, మంత్రులు

సీఎం వెంట మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

President Kovind Chittoor Tour (photo-Twitter)

Amaravati, Feb 7: చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.బెంగళూరు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి (President Kovind Chittoor Tour) ఏపీ సీఎంతో పాటు మంత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, సీఎం జగన్ (AP CM Jagan) మధ్య స్వల్ప చర్చ జరిగింది. కాగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లా మదనపల్లెలోని చిప్పిలి వెళ్లనున్నారు.

రాష్ట్రపతి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హెలికాఫ్టర్‌ ద్వారా మదనపల్లెకి సమీపంలోని చిప్పిలిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మదననపల్లెలోని సత్‌సంగ్‌ ఆశ్రమానికి వెళ్లనున్నారు. అక్కడ సత్‌సంగ్‌ ఆశ్రమం, శంకుస్థాపన, భారత యోగా విద్యా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. సుప్రసిద్ధ తత్వవేత్త ముంతాజ్‌ అలీకి చెందిన సత్సంగ్‌ ఆశ్రమ సందర్శన కోసం కోవింద్ చిత్తూరు పర్యటనకు విచ్చేశారు.

రాష్ట్రపతిని కలిసేందుకు మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు అనుమతి, కోవింద్‌కు స్వాగతం పలికేందుకు రేణి గుంటకు చేరుకున్న పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, మధ్యాహ్నం 12 గంటలకు తుది తీర్పు

సత్సంగ్ విద్యాలయంలో (Satsang Foundation) మొక్కలు నాటి, హీలింగ్ సెంటర్ కు భూమి పూజ చేస్తారు. ఆపై పీపల్ గ్రూప్ స్కూల్ కు చేరుకుని అక్కడి ఆవరణలో మొక్కలు నాటుతారు. స్కూల్ ఆడిటోరియంలో టీచర్లు, విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం ఈ సాయంత్రం బెంగళూరు పయనమవుతారు.



సంబంధిత వార్తలు

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif