Ra Kadali Ra Meeting in GD Nellore: వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు, గంగాధర నెల్లూరు రా.. కదలిరా సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీ

కదలిరా’ సభ వేదికగా సీఎం జగన్ మీద చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్‌ మానసిక ఆందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు.

Chandrababu Naidu (Photo-Video Grab)

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటుచేసిన ‘రా.. కదలిరా’ సభ వేదికగా సీఎం జగన్ మీద చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్‌ మానసిక ఆందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో ప్రజలు బటన్‌ నొక్కితే జగన్‌ మైండ్‌ బ్లాంక్‌ అవ్వాలి. జగన్‌ను నమ్ముకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాలని వాలంటీర్లను కోరుతున్నానని తెలిపారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే మేం వ్యతిరేకం కాదు. కానీ, వైసీపీకు సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాలంటీర్లకు రాజకీయాలొద్దు. మంచి పనులు చేసేవారికి సహకరిస్తామని తెలిపారు.

జగన్‌ బటన్‌ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ. 8 లక్షలు నష్టపోయింది, రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రికు ఏబీసీడీలు కూడా తెలియవంటూ రా కదలిరా సభలో మండిపడిన చంద్రబాబు

భవిష్యత్‌లో కోతలు లేని నాణ్యమైన విద్యుత్తు అందిస్తాం. విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నా. పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం. పెరిగిన సంపద పేదలకు చేరాలనేది నా సంకల్పం. తెలుగు జాతి ప్రపంచంలో నంబర్‌వన్‌గా ఉండాలి. రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిస్తున్నా. వైసీపీ ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక గల్లా జయదేవ్‌ రాజకీయాలు వదులుకున్నారు. రాజకీయ కక్షలతో పరిశ్రమలు తరిమేయడం బాధాకరం. దేశంలో 24శాతం నిరుద్యోగంతో ఏపీ అగ్రస్థానంలో ఉంది. యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చేవరకు యువతకు రూ.3వేలు భృతి ఇస్తాం’’ అని హామీ ఇచ్చారు.