Chandrababu Slams CM Jagan: జగన్‌ బటన్‌ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ. 8 లక్షలు నష్టపోయింది, రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రికు ఏబీసీడీలు కూడా తెలియవంటూ రా కదలిరా సభలో మండిపడిన చంద్రబాబు
chandrababu (Photo-TDP-Twitter)

Madugula, Feb 5: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అనకాపల్లి జిల్లా జిల్లాలోని మాడుగులలో ‘రా.. కదలిరా' (Ra Kadali Ra) బహిరంగ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ మీద (Chandrababu Slams CM Jagan) విరుచుకుపడ్డారు. 64 రోజుల్లో టీడీపీ- జనసేన ప్రభుత్వం రాబోతోందని, ఈ ఎన్నికలు ఏపీ ప్రజల భవిష్యత్‌ కోసమని, ఎన్నికల్లో రాష్ట్రం .. ప్రజలు గెలవాలని చంద్రబాబు ( TDP leader Chandrababu) ఆకాంక్షించారు.

రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్‌ లేదని, సైకో సీఎంను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. బటన్‌ నొక్కుతున్నానని జగన్‌ గొప్పలు చెబుతున్నారని.. ‘బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి’? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన పుణ్యం వల్లే చెత్తపన్ను వచ్చిందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు రా కదలిరా సభాస్థలి వద్ద బాంబు కలకలం, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్‌

ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్‌మోహన్‌రెడ్డి. కరెంటు ఛార్జీలు పెంచి రూ.64వేల కోట్ల భారం మోపారు. జగన్‌ బటన్‌ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ.8లక్షలు నష్టపోయింది. జాబ్‌ క్యాలెండర్‌, మద్య నిషేధం, సీపీఎస్‌ రద్దు, రైతు ఆత్మహత్యలు ఆపేందుకు ఎందుకు బటన్‌ నొక్కలేదు? ఈ విషయాలను ప్రజలు తెలుసుకోవాలి. జగన్‌ది ఉత్తుత్తి బటన్‌ అని గమనించాలి. జాబు రావాలంటే బాబు రావాల్సిందే’’ అని చెప్పారు.జాబ్‌ క్యాలండర్‌కు ఎందుకు జగన్‌ బటన్‌ నొక్కలేదని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల బాగు కోసం ఎందుకు బటన్‌ నొక్కలేదు?.. డీఎస్సీ కోసం ఇన్నాళ్లూ ఎందుకు బటన్‌ నొక్కలేదు జగన్‌రెడ్డి? అంటూ ప్రశ్నించారు.

మైనింగ్‌ బటన్‌ నొక్కి భూగర్భ సంపద దోచేశారని, ఇసుక బటన్‌ నొక్కి తాడేపల్లికి సంపద తరలించారని, జగన్ బటన్‌ డ్రామాలు ప్రజలకు తెలిసిపోయాయని చంద్రబాబు నాయుడు అన్నారు. రేపు ప్రజలంతా ఒకే బటన్‌ నొక్కుతారని, ప్రజలు నొక్కే బటన్‌తో జగన్‌ ఇంటికి వెళ్లడం ఖాయమని అన్నారు. ధనదాహంతో జగన్‌ ఉత్తరాంధ్రను ఊడ్చేశారని, రుషికొండను జగన్‌ ఆనకొండలా మింగేశారని దుయ్యబట్టారు. రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలస్‌ కట్టుకున్నారని, విశాఖలో రూ.40 వేల కోట్లు జగన్‌ దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.

విద్యా రంగంపై రూ. 73,417 కోట్లు ఖర్చు, అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం, ప్రారంభమైన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

జగన్ తన సలహాదారులకు రూ.వందల కోట్లు దోచిపెట్టారని, ఒక్క సజ్జల రామకృష్ణా రెడ్డికే సీఎం రూ.150 కోట్లు దోచి పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. లూలూ కంపెనీని తరిమికొట్టి ఆ భూమి మింగేశారన్నారు. విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. దోచుకోవడమే తప్ప.. జగన్‌కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేదన్నారు. విశాఖను గంజాయి కేంద్రంగా.. క్రైమ్‌ సిటీగా మార్చారని, గంజాయి అమ్ముతూ ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో దొరికిపోయారన్నారు. జగన్‌రెడ్డి లాంటి సీఎం మనకు అవసరమా? అని చంద్రబాబు ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీని బంగాళాఖాతంలో కలపాలని చెప్పారు. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేసే బాధ్యత తమదేనని చంద్రబాబు చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1,500 ఇస్తామని తెలిపారు.

ఇంట్లో ఎంత మంది ఆడబిడ్డలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ. 15 వేలు ఇస్తామని అన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డల కోసం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది ఆడబిడ్డలు ఉన్నారని తెలిపారు.

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తామని చెప్పారు. రైతును రాజుగా చేస్తామని.. ఏడాదికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే వచ్చి అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని తెలిపారు. టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తామని చెప్పారు.

సిద్ధం అన్న జగన్ సందిగ్ధంలో పడిపోయారని... ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో జగన్ కు ఏబీసీడీలు కూడా తెలియవని చెప్పారు. జగన్ ను రాజకీయాల నుంచి తరిమేయాలని అన్నారు. అమరావతి మన రాజధాని, విశాఖ మన ఆర్థిక రాజధాని అని చెప్పారు.