Raghu Rama Krishna Raju Files Nomination: టీడీపీ, జ‌న‌సేన కూట‌మికి షాక్ ఇచ్చిన ర‌ఘురామ కృష్ణంరాజు, బీ ఫాం ఇవ్వ‌క‌పోయినప్ప‌టికీ ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామినేష‌న్ దాఖలు, రెబ‌ల్ గా పోటీ చేస్తారా?

ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నామినేషన్ (Raghu Rama Krishna Raju Nomination) వేశారు. రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) భార్య, కుమారుడు భరత్ శుక్రవారం ఉండి రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

Raghu Ramakrishna Raju (Photo-ANI)

Kakinada, April 19: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ అభ్యర్థి (Undi TDP) ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక్కడ నుంచి రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును (Mantena Ramaraju) తప్పించి ఆయనకు సీటు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా టీడీపీ తరపున ఎవరికీ బీఫాం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నామినేషన్ (Raghu Rama Krishna Raju Nomination) వేశారు. రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) భార్య, కుమారుడు భరత్ శుక్రవారం ఉండి రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

Kakinada Memantha Siddham Sabha: జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్‌ పారిపోయాడు, చంద్రబాబు సంకలో పిల్లి ఈ పవన్ కళ్యాణ్ అంటూ కాకినాడలో విరుచుకుపడిన సీఎం జగన్ 

మరోవైపు ఈ నెల 22న నామినేషన్ వేసేందుకు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన కంటే రఘురామ కృష్ణంరాజు నామినేషన్ వేయడం ఉండి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. రఘురామ కృష్ణంరాజు నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే రామరాజు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పీవీఎల్ నరసింహరాజు, కాంగ్రెస్ పార్టీ నుంచి వేగేశ వెంకట గోపాల కృష్ణం పోటీ చేస్తున్నారు.