Andhra Pradesh Rains: రెండు రోజుల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, వచ్చే రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు

రానున్న రెండు రోజుల్లో అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బెంగాల్‌ సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

AP, Telangana Weather Alert Heavy Rains To Hyderabad, IMD issues yellow alert

ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బెంగాల్‌ సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

ఎక్కడ ఏం జరిగినా జగనే కారణమంటారు, చంద్రబాబుపై విరుచుకుపడిన వైఎస్ జగన్, ఇకనైనా జగన్నామం ఆపు అంటూ ఎద్దేవా

తాజాగా వాయుగుండం ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బీహార్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 20 నుంచి అక్టోబరు మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.