Veg Thali For 5 Paise Coin: ఐదు పైసల కాయిన్ ఇస్తే రూ. 400 విలువ చేసే భోజనం, విజయవాడలో బంపర్ ఆఫర్ ప్రకటించిన హోటల్, కాయిన్స్ పట్టుకొచ్చిన జనాలను చూసి తల పట్టుకున్న హోటల్ యజమాని, చివరికి ఏం చేశాడంటే?

ఇంత మంది భోజనం చేసేందుకు వస్తారని తాము ఊహించలేదని ఆ రెస్టారెంటు యజమాని మీడియాకు తెలిపారు. దాదాపు 300-400 మంది కస్టమర్లు వస్తారని తాము అనుకుంటే 1,000 మంది కంటే ఎక్కువ కస్టమర్లు వచ్చారని చెప్పారు.

restaurant serves unlimited thali for 5 paise (Picture credit: Cauldron Sisters)

Vijayawada, DEC 02: ఫుల్ మీల్స్ తినాలంటే ఇప్పుడున్న రోజుల్లో కనీసం వంద రూపాయలు కావాలి. అలా కాదంటే ప్రభుత్వం సబ్సిడీ మీద అందించే భోజనం తినాలంటే కూడా రూ.5 కావాలి. కానీ విజయవాడలో ఓ హోటల్ యజమాని (restaurant) పెట్టిన ఆఫర్‌ అందరినీ ఆశ్చర్య పరిచింది. కేవలం ఐదు పైసలకే ( 5 paise) 35 రకాల వంటలతో భోజనం పెడతానంటూ ప్రకటించాడు. 5 పైసల కాయిన్ తీసుకొస్తే రూ.400 విలువచేసే శాకాహార భోజనం (Veg meals) ఉచితంగా తినొచ్చని తెలిపాడు. 35 రకాల వంటకాలు రుచిచూడొచ్చని ప్రకటించింది. 5 పైసల కాయిన్స్ ఇప్పట్లో ఎవరి దగ్గర ఉంటాయని అందరూ అనుకున్నారు. అయితే, ఆ రెస్టారెంటుకు 5 పైసల కాయిన్స్ ( 5 paise coin) పట్టుకుని వచ్చిన వారిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ హోటల్ కు భారీగా జనాలు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

5 పైసలు పట్టుకుని రాజ్ భోగ్ రెస్టారెంటు ముందుకు వచ్చిన జనాలు లోపలికి వెళ్లేందుకు ఎగబడ్డారు. ఇంత మంది భోజనం చేసేందుకు వస్తారని తాము ఊహించలేదని ఆ రెస్టారెంటు యజమాని మీడియాకు తెలిపారు. దాదాపు 300-400 మంది కస్టమర్లు వస్తారని తాము అనుకుంటే 1,000 మంది కంటే ఎక్కువ కస్టమర్లు వచ్చారని చెప్పారు.

Sankalpa Siddhi Cheating Case: సంకల్ప సిద్ధి ఛీటింగ్ కేసు, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపాటు 

తాము మొదట వచ్చిన 50 మందికి మాత్రమే 5 పైసలకు భోజనం అందించామని, మిగతా అందరికీ సగం ధరకే (రూ.200) ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు తమ రెస్టారెంటు బాగా ఫేమస్ అయిపోయిందని సంబరపడిపోయారు. రాజస్థానీ, గుజరాతీ, ఉత్తర భారత తాలీని తాము వడ్డించామని చెప్పారు.