Car Accidents in Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది మంది మృతి, పలువురికి గాయాలు, వీడియోలు ఇవిగో..
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎం.కొంగరవారిపల్లి వద్ద మీడియన్‌ను కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 4 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పది మంది మరణించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎం.కొంగరవారిపల్లి వద్ద మీడియన్‌ను కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా ఇందుకూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య, ఆయన భార్య జయంతి, వారి బంధువు పద్మమ్మతోపాటు కారు డ్రైవర్ సమీర్ మృతి చెందారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో చోటుచేసుకున్న మరో ఘటనలో నలుగురు మృతి చెందారు. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు వెళ్తున్న లారీపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కార్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను స్వామినాథన్ (35), రాకేశ్ (12), రాధా ప్రియా (14), గోపి(31)గా గుర్తించారు.
Here's Videos
తీవ్ర గాయాలైన మరొకరిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చంద్రగిరి మండల పరిధిలోని సి.మల్లవరం జాతీయ రహదారిపై మరో ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు రోడ్డుకు దూసుకెళ్లింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. కారులోని ఇద్దరు ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇద్దరికీ స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తిరుపతి నుంచి చంద్రగిరి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.