Madan Mohan Press Meet: శృంగారం పూర్తి కాకముందే పడక మీది నుంచి లేచాను, ఆ బిడ్డ నా బిడ్డ కాదు, మీడియా ముందుకు వచ్చిన శాంతి భర్త మదన్
ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాను. దాంతో... ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వొక భర్తవి అయి ఉండి ఇలా అడుగుతావా అని మండిపడింది. నువ్వింత అనుమాన పక్షివా అని ప్రశ్నించింది. అది కాదు శాంతీ... నేను శృంగారం పూర్తిగా చేయలేదు కదా... ఇది ఎలా సాధ్యమైంది? అని అడిగాను
ఏపీలో ఇప్పుడు వైసీపీ విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. శాంతికి ఎవరి వల్ల గర్భం వచ్చిందో నిగ్గు తేల్చాలంటూ ఆమె భర్త మదన్ మోహన్ తెరపైకి రావడంతో అందరి దృష్టి అటే ఉంది. ఇప్పటికే శాంతి, విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి తమ గొంతుక వినిపించారు. తమకేమీ తెలియదని, మదన్ మోహన్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని మీడియా వేదికగా ఖండించారు.
తాజాగా శాంతి భర్త మదన్ మోహన్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తనకు తండ్రి చిన్నప్పుడే చనిపోయారని, నాడు ఇందిరాగాంధీ ఇచ్చిన స్థలం మూడు సెంట్లు రోడ్డు పక్కనే ఉండడంతో దాని వల్ల కాస్త లాభపడ్డానని వివరించారు. తాను అమెరికాలో ఎంఎస్ చేశానని, పీహెచ్ డీ కూడా చేశానని... ప్రస్తుతం సనత్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పదేళ్లుగా పనిచేస్తున్నానని వెల్లడించారు. విజయసాయి రెడ్డి నాకు తండ్రి లాంటివాడు, రూ.75 కోట్ల కోసం ఇంత నీచపు ఆరోపణలు చేస్తారా, భర్త ప్రెగ్నెన్సీ ఆరోపణలపై స్పందించిన శాంతి
మా ఊరు కోవెలకుంట్ల. నంద్యాలలో ఉండే కాలింగిరి శాంతి సంబంధం కుదిరింది. ఈమె కూడా ఎస్టీ ఎరుకల. బంధువుల ద్వారా పరిచయం అయింది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. 2013 నవంబరు 9న మా పెళ్లి జరిగింది. మేం ఒకరికొకరు బాగా నచ్చాం. అప్పటికి ఆమె పడాల రామిరెడ్డి లా కాలేజిలో ఎల్ఎల్ బీ చదువుతోంది. దేవుడు నేను కోరుకున్న అమ్మాయిని ఇచ్చాడు... ఇద్దరం హైదరాబాద్ లో స్థిరపడ్డాం. ఆ తర్వాత కాలంలో నేను కూడా లా చదివాను. కాన్ స్టిట్యూషనల్ లా కోర్సులో నేను గోల్డ్ మెడలిస్టును.
Here's Press meet
2015లో మాకు ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారు. నేను నయాపైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను. అమెరికాలో నేను సంపాదించిన రూ.10 లక్షలు భారత్ కు తీసుకువచ్చి అందులో రూ.5 లక్షలతో పెళ్లి చేసుకున్నాను. శాంతి న్యాయవాద వృత్తి స్వీకరించేలా ప్రోత్సహించాను. అంతా సవ్యంగానే సాగింది. 2017లో దమ్మాయిగూడలో ఒక డూప్లెక్స్ ఇల్లు తీసుకున్నాం. 2019లో ఆమెకు ఏపీ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉద్యోగం వచ్చింది. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారి చేత క్షమాపణలు చెప్పిస్తా, ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
శాంతి చిన్నతనంలోనే వారి కుటుబాన్ని తండ్రి వదిలేశాడు. దాంతో శాంతి తల్లి ఓ బీసీ కులస్తుడ్ని రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్త ద్వారా శాంతి తల్లికి ఇద్దరు అమ్మాయిలు కలిగారు. ఇవన్నీ తెలిసి కూడా నేను శాంతిని పెళ్లి చేసుకున్నాను. ఇద్దరం చాలా ప్రేమగా ఉండేవాళ్లం. 2020లో శాంతికి విశాఖలో మొదటి పోస్టింగ్ ఇచ్చారు. నేను కాన్ స్టిట్యూషన్ లా కోర్సులో గోల్డ్ మెడలిస్ట్ ను. దాంతో పీహెచ్ డీ చేసేందుకు అమెరికా వెళ్లాలనుకున్నాను.
అప్పటికి శాంతి ఉద్యోగంలో చేరింది కాబట్టి, నేను పీహెచ్ డీ చేసేందుకు ఇదే సరైన సమయం అనుకున్నాను. 2020 జనవరిలో అమెరికా వెళ్లాను. రెండు సార్లు స్వదేశానికి తిరిగొచ్చాను. అసలే నా భార్యకు ఆవేశం ఎక్కువ... ఇద్దరు పిల్లలను చూసుకోగలుగుతుందా, లేదా... అని పరిశీలించడానికి వచ్చాను. నేను భారత్ రాగానే కొవిడ్ ప్రారంభమైంది. దాంతో రెండేళ్లు ఇక్కడే ఉండిపోయాను.
ఆ తర్వాత మళ్లీ అమెరికా నుంచి పిలుపొచ్చింది. పిల్లల కోసం ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఇద్దరం గ్రూప్-1 స్థాయి అధికారులమే కదా... ఇంకెందుకు అమెరికా వెళ్లడం అనుకున్నాను. అయితే, అమెరికా వెళ్లాలంటూ శాంతి ఒత్తిడి చేసింది. అప్పటికే శాంతి చాలా సెన్సేషనల్ అయింది. పుష్పవర్ధన్ అనే డీసీపై ఇసుక చల్లడం, గొడవలతో వార్తల్లోకెక్కింది. న్యాయం కోసం గొడవలు చేయడం తప్పుకాదు... తిక్క తిక్క గొడవలు చేయడం తప్పు. అప్పటికే ఆమె మాటలు సరిగ్గా ఉండేవి కావు. పెళ్లయినప్పటి నుంచి చెబుతుండేవాడ్ని... అలా మాట్లాడకూడదు అని. కానీ, ఏందిరా నీ నీతులు అన్నట్టు ఉండేది.
ఆ తర్వాత నేను మళ్లీ అమెరికా వెళ్లాలనుకున్నాను. నా భార్య శాంతి కూడా అమెరికా వెళ్లు, వెళ్లు అంటూ గట్టిగా చెప్పింది. కానీ నా స్కాలర్షిప్ అప్లికేషన్ కాలపరిమితి పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఏంచేయాలా అని ఆలోచించాను. అప్పుడే నా భార్య విజయసాయిరెడ్డి గురించి చెప్పింది. ఓసారి హైదరాబాదు జూబ్లీహిల్స్ లో ఆయన ఇంటికి కూడా నన్ను తీసుకెళ్లింది. అప్పుడు విజయసాయిరెడ్డి గారి భార్య సునంద మేడమ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు మేం అందరం ఫొటోలు కూడా దిగాం. సార్ పక్కన నా భార్య శాంతి నిలబడితే నేనే ఫొటో తీశాను. ఆయన నా తండ్రి వయసు వాడు అని నమ్మాను. అప్పుడు నాకు ఎలాంటి అనుమానాలు లేవు.
నా అప్లికేషన్ గురించి శాంతి ద్వారా విజయసాయిరెడ్డి సార్ కి చెబితే... వెంటనే ఢిల్లీలో మూడు మంత్రిత్వ శాఖలను కదిపి, నా పని చేసిపెట్టారు. దాంతో నేను 2022 జనవరిలో మళ్లీ అమెరికా వెళ్లాను. ఆ తర్వాత సెప్టెంబరులో శాంతి ఫోన్ చేసి ఒక్క వారం వచ్చిపో అని కోరింది. అయితే నాకు రీసెర్చ్ పని ఉంది రాలేను అని చెప్పాను.
విశాఖలో ప్రేమ సమాజం అనే సంస్థకు చెందిన భూముల విషయంలో సార్ కు ఫేవర్ గా చేశాను. ఆయన తన పరపతి ఉపయోగించి మనకు ఆర్థికంగా కొంచెం సాయం చేస్తున్నారు.. విజయవాడలో రూ.4 కోట్లు పెట్టి ఒక విల్లా కొందాం... అందుకే నిన్ను ఇండియా రమ్మన్నాను అని చెప్పింది. సార్ తన పరపతి ఉపయోగించి రెండున్నర కోట్లకే ఇప్పిస్తామన్నారని తెలిపింది. తక్కువ రేటుకే వస్తుండడంతో భారత్ వచ్చాను. సెప్టెంబరు 19ను భారత్ వచ్చి 25 వరకు ఉన్నాను. విజయసాయి సార్ గైడెన్స్ తో ఓ బిల్డర్ నుంచి కోటి రూపాయలు తెచ్చాం. కోటి రూపాయలు వైట్ మనీ.... మిగతా కోటిన్నర బ్లాక్ మనీ. అయితే ఎందుకింత రిస్క్ అనుకున్నాను.
ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లి విజయసాయి సార్ ఇంటికి వెళ్లమని శాంతి చెప్పడంతో వెళ్లాను. అప్పుడు విజయసాయి సార్ భార్య సునంద మేడమ్ ఉన్నారు. ఆమె ఓ బ్యాగ్ అక్కడ పెట్టారు. అందులో రూ.60 లక్షలు ఉంటాయని శాంతి చెప్పడంతో, ఓసారి బ్యాగ్ ఓపెన్ చేసి చూసుకున్నాను. ఆ తర్వాత రోడ్డు మార్గంలో వైజాగ్ వెళ్లాను. మనం కొన్ని విషయాల్లో సార్ కు సాయం చేశాం కాబట్టి, ఆయన మనకు ఇలా సాయం చేస్తున్నాడని నా భార్య చెప్పడంతో నేను నమ్మాను.
నేను అమెరికా నుంచి వస్తుండడంతో... విజయసాయిరెడ్డి సార్ కోసం పెర్ఫ్యూమ్ లు తీసుకురావాలని శాంతి చెప్పింది. ఆమె చెప్పినట్టే తెచ్చాను. నేను అమెరికా నుంచి చాలారోజుల తర్వాత భారత్ వచ్చాను కాబట్టి... నా భార్యతో శారీరకంగా కలిశాను. అయితే ఆమె గర్భం దాల్చే విధంగా మా కలయిక జరగలేదు. నేను ఇంకా మూడేళ్లు అమెరికాలో ఉండాల్సి రావడంతో మళ్లీ పిల్లలు కనకూడదని నిర్ణయం తీసుకున్నాను. దాంతో, శృంగారం పూర్తి కాకముందే పడక మీది నుంచి లేచాను.
కానీ ఆ తర్వాత శాంతి తాను గర్భం దాల్చిన విషయం చెప్పడంతో నాకు ఆశ్చర్యం వేసింది. పిల్లలు వద్దు అనుకుని మనం జాగ్రత్త పడ్డాం కదా... ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాను. దాంతో... ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వొక భర్తవి అయి ఉండి ఇలా అడుగుతావా అని మండిపడింది. నువ్వింత అనుమాన పక్షివా అని ప్రశ్నించింది. అది కాదు శాంతీ... నేను శృంగారం పూర్తిగా చేయలేదు కదా... ఇది ఎలా సాధ్యమైంది? అని అడిగాను. మరోసారి అలా అడిగితే చెప్పుతో కొడతా అని చెప్పింది. దాంతో నేను గూగుల్ లో వెదికితే... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్ని డ్రాప్స్ వల్ల కూడా గర్భం వచ్చే అవకాశం ఉందని అందులో ఉంది. దాంతో నాకు నేను సర్దిచెప్పుకున్నాను.
కానీ 2024లో నాకు తెలిసిన విషయం ఏంటంటే... సభ్య సమాజం సిగ్గుపడేలా... నాతో పడుకునే సరికే ఆమె ఎనిమిది వారాల గర్భంతో ఉంది. ఆమెకు 2023 ఏప్రిల్ 15న డెలివరీ అయింది. నేను వచ్చింది 2022 సెప్టెంబరు 19... ఆమెకు డెలివరీ అయింది ఏప్రిల్ 15. కనీసం ఏడు నెలలు కూడా పూర్తి కాలేదు. నేనెంత పిచ్చివాడ్ని అంటే... ఆ సమయంలో నేను అది కూడా కౌంట్ చేసుకోలేదు. నాకు పుట్టిన బిడ్డే అని నమ్మేశాను.
అబ్బాయి పుట్టాడు కదా... భారత్ వస్తానంటే శాంతి వద్దు అని చెప్పింది. నేను భారత్ వచ్చాక బిడ్డను చూద్దామంటే... శాంతి నన్ను కలిసేందుకు ఇష్టపడలేదు. నీకు గర్భం ఎలా వచ్చిందని నన్ను అడగరాని ప్రశ్న అడిగావు... ఇక నీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. అప్పటికి శాంతికి పుట్టిన బిడ్డ నా బిడ్డే అనుకుంటున్నాను.
ఆ తర్వాత శాంతి స్వయంగా అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్ కి, హైదరాబాద్ లో ఉన్న నా బ్రదర్ కి ఫోన్ చేసి... ఈ బిడ్డ మదన్ కు పుట్టిన బిడ్డ కాదు... నేను ఐవీఎఫ్ పద్దతిలో ఈ బిడ్డను కన్నాను అని చెప్పింది. దాంతో, నేను శాంతికి ఫోన్ చేసి ఎందుకు ఐవీఎఫ్ చేయించుకున్నావు... నేనేమీ నపుంసకుడ్ని కాదు కదా అని ప్రశ్నించాను. నేను భారత్ వచ్చేసరికి ఐవీఎఫ్ సర్టిఫికెట్ రెడీ చేయ్ అని స్పష్టం చేశాను.
ఆ తర్వాత ఇండియా వచ్చాను. శాంతి ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించలేదు. ఏ ఆసుపత్రిలో చేయించుకుందో కూడా చూపించలేదు. గట్టిగా నిలదీసేసరికి హై ప్రొఫైల్ వ్యక్తులతో ఐవీఎఫ్ చేయించుకున్నాను అని చెప్పింది. ఇంకా గట్టిగా నిలదీసేసరికి శాంతి నాకు ఏం చెప్పిందంటే... విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు... ఆయనకు ఒక కూతురు ఉన్నా ఆమె దత్త కూతురు... ఆయనకు పిల్లలంటే ఇష్టం.. నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టం... అందుకే ఆయనకు ఒక బాబు కావాలంటే కని పెట్టాను... అని చెప్పింది.
ఆ మాటతో నాకు గుండెలు పగిలిపోయాయి. ఆయన అడగడం ఏంటి... నువ్వు కని పెట్టడం ఏంటి అని ప్రశ్నించాను. విజయసాయిరెడ్డితో శారీరక సంబంధం అనుకో అని తనే చెప్పింది. ఇప్పుడు నేను వెళ్లి విజయసాయిరెడ్డి గారిని ఆ విషయం అడగ్గలనా? ఆ తర్వాత నా పెద్ద కూతురిని హత్తుకుని ఏడ్చాను.
పుట్టిన బిడ్డకు తండ్రెవరో తెలియదు... అడిగితే ఐవీఎఫ్ అంటుంది... గట్టిగా అడిగితే విజయసాయిరెడ్డి పేరు చెబుతుంది... ఆధారాలు చూపించమంటే ఆయన పెద్దాయన... ఎలా బయటికి వస్తారు? ఐవీఎఫ్ డోనర్లుగా వేరే వాళ్ల పేరు ఉంటుంది అని చెప్పింది.
ఇప్పుడు నేను ఈ ఆధారాలన్నీ సిద్ధం చేసుకునే సరికి ఈ ఆర్నెల్లు సమయం పట్టింది. ఇక నిన్ను ఏలుకోను అని చెప్పాను. దాంతో శాంతి.. ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా... విజయసాయిరెడ్డితో బేబీని కన్నాను... నువ్వే నా లైఫ్ లోంచి వెళ్లిపో అని నాతో అన్నది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి?" అంటూ మదన్ మోహన్ కన్నీటి పర్యంతమయ్యారు.