IPL Auction 2025 Live

AP Lockdown 4: ఏపీలో దుకాణాలు తెరుచుకోండి, ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల గురించి ఓ సారి తెలుసుకోండి

పట్టణ ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) మార్గదర్శకాలను జారీ చేసింది. మే 31 వరకు ప్రకటించిన నాలుగో విడత లాక్‌డౌన్‌లో (Lockdown 4) కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో మినహా ఇతర పట్టణాల్లో ఎంపిక చేసిన దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరిచేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ (AP Municipal Department) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Lockdown in India | (Photo Credits: PTI)

Amaravati, May 21: ఏపీలో మే 31 వరకు లాక్ డౌన్ (AP Lockdown 4) పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం పలు సడలింపులను ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) మార్గదర్శకాలను జారీ చేసింది. మే 31 వరకు ప్రకటించిన నాలుగో విడత లాక్‌డౌన్‌లో (Lockdown 4) కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో మినహా ఇతర పట్టణాల్లో ఎంపిక చేసిన దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరిచేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ (AP Municipal Department) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిధిలో పరిస్థితిని సమీక్షించి దుకాణాలు తెరిచేందుకు కార్యాచరణ చేపట్టాలని పేర్కొంది. పురపాలక, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, పరిశ్రమలు, మార్కెటింగ్, మత్స్య, రవాణా శాఖల మార్గదర్శకాలను పాటించాలని చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో అనుమతించిన దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరవొచ్చు. మందుల దుకాణాలకు మరింత సమయం అనుమతిస్తారు. వడగాడ్పుల ముప్పు, ఈ నెల 25న రోహిణి కార్తె ప్రవేశం, ఈ మూడు రోజులు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని తెలిపిన వాతావరణ శాఖ

దుకాణాల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. దుకాణాల లోపల, బయట వృత్తాకార మార్కింగులు వేయాలి దుకాణాల లోపల గరిష్టంగా ఐదు మందికి మించి అనుమతి లేదు. అక్కడ పనిచేసేవారు, కొనుగోలుదారులు కచ్చితంగా మాస్కులు ధరించాలి. దీనికి దుకాణ దారులే బాధ్యత వహించాలి. దుకాణాలను రోజు తెరిచే ముందు ప్రవేశ ద్వారాలు, బయటకు వేళ్లే ద్వారాలు, పార్కింగ్‌ ప్రదేశాలు, లిఫ్టులలో శానిటేషన్‌ చేయాలి. విధ్వంసం సృష్టించిన అంఫాన్, వెస్ట్ బెంగాల్,ఒడిషాలో భారీగా ఆస్తి నష్టం, నీటిలో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు, వీడియోల్లో విధ్వంసం ఎలా ఉందో మీరే చూడండి

దుకాణాల్లో పనిచేసే సిబ్బంది అందరూ తమ మొబైల్‌ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వృద్ధులు, చిన్న పిల్లలను వీలైనంతవరకూ దుకాణాల్లోకి అనుమతించకూడదు. అన్ని దుకాణాలు 50% సిబ్బందితోనే పనిచేయాలి. వీలైనంతవరకు నగదు రహిత లావాదేవీలకే ప్రాధాన్యమివ్వాలి.దుకాణాల్లోకి ప్రవేశించేందుకు, బయటకు వచ్చేందుకు ద్వారాలు వేర్వేరుగా ఉండాలి.

వీటికి ప్రత్యేక అనుమతి

స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్టేడియంలు తెరిచేందుకు అనుమతిచ్చారు. క్రీడాకారులు, శిక్షకులకు మాత్రమే ప్రవేశం ఉంది. సందర్శకులను అనుమతించరు.

ఆహార పదార్థాలను డోర్‌ డెలివరీ చేసే, టేక్‌ అవే సదుపాయం ఉన్న రెస్టారెంట్లకు అనుమతి. అలాగే వైద్య, ఆరోగ్య, పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం, వలస కార్మికులు, విదేశీ టూరిస్టులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో వారికి ఆహార పదార్థాలు అందించేందుకు ఉద్దేశించిన హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి.

బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులలో ఉన్న క్యాంటీన్లకు అనుమతి ఉంది.

తెరిచేందుకు అనుమతిలేనివి

సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్, ఎస్లాబ్లిష్‌మెంట్‌ పార్కులు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు, బంగారు ఆభరణాలు, బట్టలు, చెప్పుల దుకాణాలు. స్పాలు, మసాజ్‌ సెంటర్ల నిర్వహణకు అనుమతి లేదు. కానీ సెలూన్లకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. అందుకోసం వారు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఎక్కువ బడ్జెట్‌తో నిర్వహించే సెలూన్లు, తక్కువ బడ్జెట్‌తో నిర్వహించే సెలూన్లు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం వేర్వేరుగా నిర్దేశించింది.