YS Jagan Comments on Chandrababu: కరకట్ట దగ్గర ఇళ్లు మునిగింది కాబట్టే..చంద్రబాబు కలెక్టరేట్ లో ఉంటున్నారు! సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ జగన్
బుధవారం విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.
Vijayawada, SEP 04: ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నివాసముంటున్న ప్రాంతం కూడా నీళ్లలో మునిగినందును అక్కడ ఉండలేని స్థితిలో కలెక్టరేట్‌లో (Collectorate) ఉండి బాధితులకు సహాయం చేస్తున్నట్లు బిల్డప్‌లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.
Here's Tweet:
వర్షాలు, వరదల సమాచారం ఉన్నాకూడా చంద్రబాబు ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఎక్కడా రిలీఫ్ కేంద్రాలు కనిపించడం లేదని ఆరోపించారు. వైసీపీ(YCP) హయాంలో గోదావరికి వరదలోస్తే పెద్ద ఎత్తున్న ఆదుకున్నామని అన్నారు.
ముందస్తు చర్యలు తీసుకుని నష్టం జరుగకుండా అడ్డుకున్నామని పేర్కొన్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంటే , కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఉంటే విజయవాడ విపత్తుకు గురి అయ్యేది కాదని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా అట్టర్‌ఫ్లాప్ అని అన్నారు. వరదల్లో చనిపోయిన వారికి రూ. 25 లక్షల పరిహారం అందించాలని, ప్రతి ఇంటికి రూ. 50 వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.