Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు భారీ ఊరట, బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (AP CM Chandrababu Naidu) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. స్కిల్‌ స్కాం కేసులో (Skill Case) బెయిల్‌ రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌ను జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది.

CM Chandrababu Polavaram visit (Photo-TDP/X)

Vjy, Jan 15: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (AP CM Chandrababu Naidu) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. స్కిల్‌ స్కాం కేసులో (Skill Case) బెయిల్‌ రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌ను జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్‌ ఫైల్‌ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గి తెలిపారు. చార్జిషీట్‌ దాఖలు చేసినందున బెయిల్‌ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు జస్టిస్‌ బేలా త్రివేది వెల్లడించారు.అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది.

చంద్రబాబు మెడకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం ఉచ్చు, ఏ1గా టీడీపీ అధినేతను పేర్కొంటూ 41 మందిని నిందితులగా పేర్కొన్న సీఐడీ

2023 నవంబరులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.నైపుణ్యాభివృద్ధి సంస్థకు (స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)చెందిన నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగంతో సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. స్కిల్‌ కేసులో మొత్తం 41 మందిని నిందితులుగా (CID files chargesheet against 41 accused) సీఐడీ పేర్కొంది. ఏ1గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ2గా మాజీ కార్మిక శాఖా మంత్రి అచ్చెన్నాయుడు (Chandrababu A1, Achennaidu A2), ఏ3గా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, ఏ4గా ఎపీఎస్‌ఎస్‌డీసీ అప్పటి డైరెక్టర్‌, మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ,సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌, పీవీఎస్‌పీ స్కిలర్‌ సంస్థల అధికారులను ప్రధాన నిందితులుగా సీఐడీ చార్జిషీట్‌లో పేర్కొంది.

వారిపై ఐపీసీ సెక్షన్లు 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477 (ఏ), 409, 201, 109 రెడ్‌విత్‌ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్‌ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఈ చార్జిషీట్‌లో పేర్కొంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థకు చెందిన నిధుల దుర్వినియోగంలో నిందితుల పాత్ర ఉందని సీఐడీ ఛార్జిషీట్‌లో పేర్కొంది. కుట్రలో భాగంగా సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థలకు రూ.371 కోట్లు మళ్లించారని ఆరోపించింది.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్.. స్కిల్ డెవలప్‌ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల నిరసన

రూ.330 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌గా కనికట్టు చేశారని వివరించింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్‌ కంపెనీ వాటా 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోయినా, ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను జీఎస్టీతోసహా రూ.371 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని తెలిపింది. అందులో రూ.241 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబు కొల్లగొట్టారని వివరించింది.

ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్‌ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్‌ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్‌– డిజైన్‌టెక్‌ కంపెనీలు వాటి వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఏపీఎస్‌ఎస్‌డీసీ మాత్రం తన వాటా కింద డిజైన్‌టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారని సీఐడీ పేర్కొంది.

అందుకోసం ఈ ప్రాజెక్టు నోట్‌ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. డిజైన్‌టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా బోగస్‌ ఇన్వాయిస్‌లతో అక్రమంగా తరలించారు. షెల్‌ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోను చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్లర్‌ తదితర షెల్‌ కంపెనీల ద్వారా నిధులను హవాలా మార్గంలో మళ్లించారని సీఐడీ తన ఛార్జిషీట్ లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ అయి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా 52 రోజులు ఉన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now