Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు మరో మలుపు, అప్రూవర్‌గా మారుతున్నట్లు ఏసీబీ కోర్టుకు తెలిపిన ఏ13 నిందితుడు చంద్రకాంత్ షా
ఏ13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు సీఐడీ అధికారులు హాజరుపర్చారు. అప్రూవర్‌గా మారుతున్నట్లు కోర్టు ఎదుట చంద్రకాంత్ షా తెలిపారు.
Vjy, Dec 5: ఏపీలో సంచలనం రేపిన ‘స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు సీఐడీ అధికారులు హాజరుపర్చారు. అప్రూవర్‌గా మారుతున్నట్లు కోర్టు ఎదుట చంద్రకాంత్ షా తెలిపారు. తదుపరి విచారణను ఏసీబీ కోర్టు జనవరి5కి వాయిదా వేసింది. చంద్రకాంత్ షా స్టేట్‌మెంట్‌ని జనవరి 5న ఏసీబీ కోర్టు రికార్డు చేయనుంది.ఈ స్కాంలో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా అప్రూవర్‌గా మారారు.
మద్యం కేసులో తొందరపాటు చర్యలొద్దని ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం
స్కిల్ స్కాం కేసులో నిందితుడు (ఏ–13)గా ఉన్న ఆయన తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్కాంలో బోగస్ ఇన్వాయిస్‌ల ద్వారా నిధులను ఎలా కొల్లగొట్టిందీ వివరిస్తూ ఆయన గతంలోనే గుంటూరులోని న్యాయస్థానంలో 2022, జులై 23న 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు.
ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారి స్కిల్ స్కాంలో సూత్రధారులు, పాత్రధారులు, తెరవెనుక కుట్రను వెల్లడించేందుకు ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అందుకోసం తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించి తనను ఈ కేసులో సాక్షిగా పరిగణించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రకాంత్ షాను సీఐడీ గతంలో అరెస్టుచేయగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.