Skill Development Scam Case: చంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌పై మరి కాసేపట్లో తీర్పు, ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, ఎవరేం వాదించారంటే..

సాయంత్రం గం. 4.30ని.లకు తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించగా, ఏపీ సీఐడి తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు

Chandrababu Naidu,File Image. (Photo Credit: ANI)

Chandrababu House arrest petition: చంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులోవాదనలు ముగిశాయి. సాయంత్రం గం. 4.30ని.లకు తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించగా, ఏపీ సీఐడి తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు.

సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబుకు ఇంట్లో కన్నా జైల్లోనే సెక్యూరిటీ ఉంటుందని కోర్టుకు వివరించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామని తెలిపారు. జైల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత ఉన్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 24 గంటలూ పోలీసులు విధుల్లోనే ఉంటున్నారని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశం ఉండటం వల్ల.. చంద్రబాబును హౌస్‌ రిమాండ్‌కు అనుమతించవద్దని న్యాయస్థానాన్ని కోరారు.

చంద్రబాబు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు, అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసుతో సహా మరో రెండు పిటిషన్లు దాఖలు చేసిన ఏపీ సీఐడీ

అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు

►చంద్రబాబు భద్రతకి ఎటువంటి ఇబ్బంధులు లేవు

►రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు కి గట్టిభద్రత కల్పించాం

►జైలులో చంద్రబాబుకి ప్రత్యేక గదితో పాటు సిసి కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది

►చంద్రబాబు భద్రతపై తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డిజి ఆదేశాల లేఖని మీ ముందు ఉంచుతున్నా

►జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడి భధ్రతా బాధ్యత ప్రభుత్వానిదే

►చంద్రబాబు కోరిన‌ విధంగా కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకి ఇంటి భోజనం, మందులు అందుతున్నాయి

►చంద్రబాబుకి భద్రత కొనసాగుతోంది

►గృహ నిర్బందం పిటిషన్ డిస్మిస్ చేయాలి

►ఈ‌ పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు

►చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది

AG పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు

►రాజమండ్రి సబ్ జైల్ 50 అడుగుల గోడ...అక్కడికి ఎవరు రాలేరు....?

►రాజమండ్రి జైల్ కంటే మించిన సెక్యూరిటీ ఎక్కడా ఉండదు

►అలాగే డాక్టర్స్ 24 గంటలు అందుబాటులో ఉంటారు

►కాబట్టి చంద్రబాబుకు హౌజ్‌ అరెస్ట్ అవసరం లేదు

►చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుంది

►చంద్రబాబు ఆరోగ్యం బాగుంది

►చంద్రబాబు భద్రత.. ఆరోగ్యంపై అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.