Vjy, Sep 11: టీడీపీ అధినేత అధినేత చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ రెండు పిటిషన్లు దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్ పిటిషన్ వేయగా.. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ నమోదు చేసిన కేసులో చంద్రబాబును కస్టడీకి కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేసింది.
చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు అందులో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.2022లో నమోదైన ఈ కేసులో పీటీ వారెంట్‌పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేష్ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొంది సీఐడీ.
ఇక ఏసీబీ కోర్టులో చంద్రబాబును జైల్లో వద్దు, గృహ నిర్భంధంలో ఉంచండి అంటూ బాబు తరపు లాయర్లు వేసిన పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నాయి.చంద్రబాబు హౌజ్ అరెస్టు పిటిషన్‌ను తిరస్కరించాలంటూ సీఐడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. రాజమండ్రి జైలులో పూర్తి భద్రత మధ్య చంద్రబాబు ఉన్నారు. బాబును హౌజ్ అరెస్టులో ఉంచాల్సిన అవసరం లేదు.
ఆర్థిక నేరాల్లో ఉన్న నిందితుడికి హౌజ్ అరెస్ట్ అనేది అవసరం లేదని తన పిటిషన్లో పేర్కొంది. సీఆర్‌పీసీలో హౌజ్ అరెస్ట్ అనేదే లేదు. బెయిల్ ఇవ్వలేదు కాబట్టే హౌజ్ రిమాండ్ కోరుతున్నారు. అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు అని సీఐడీ కౌంటర్ కాపీలో పేర్కొంది.