Skill Development Scam Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు, రేపు హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ (వెకేషన్‌ బెంచ్‌) శుక్రవారం (27న) విచారణ జరపనుంది.

chandrababu (Photo-PTI)

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ (వెకేషన్‌ బెంచ్‌) శుక్రవారం (27న) విచారణ జరపనుంది. న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్‌ ముందు శుక్రవారం 8వ కేసుగా ఈ బెయిలు పిటిషన్‌ విచారణ జాబితాలోకి వచ్చింది.

ప్రపంచంలో ఎక్కువ అవకాశాలు కలిగిన దేశం మన భారత్‌ ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ పర్యటనలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 19న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి వెకేషన్‌ బెంచ్‌ ముందుకు వాయిదా వేసింది. చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను 27నాటి విచారణకు కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగార అధికారులను ఆదేశించిన విషయం విదితమే.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif