Skill Development Scam Case: చంద్రబాబు పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ, కస్టడీ, బెయిల్ పిటిషన్‌లపై ఏసీబీ కోర్టులో విచారణ రేపటికి వాయిదా

చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్‌ మెమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ.. రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు

Supreme Court and Chandrababu (Photo-Wikimedia Commons/ FB)

New Delhi Sep 26: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్‌ మెమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ.. రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ పిటిషన్‌ ఏ బెంచ్‌ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి వెల్లడికానుంది.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్‌లపై ఏసీబీ కోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో విచారణ రేపటికి వాయిదా పడింది. కస్టడి పిటిషన్‌పై చంద్రబాబు తరపు న్యాయవాదులు దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. కాగా.. బెయిల్ పిటిషన్ అంశాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావించగా.. రేపు సీఐడీ కోర్టులో కోరాలని న్యాయమూర్తి సూచించారు.

చంద్రబాబు నాయుడుకు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగింపు

ఇక క్రిమినల్ కంటెంప్ట్ పై రేపు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు అడ్వొకేట్‌ జనరల్‌. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో ఏజీ కోరారు. కేసును డివిజన్ బెంచ్ ముందు మెన్షన్ చేసిన ఏజీ..రేపు విచారిస్తామని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది.కాగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై కొంతమంది సోషల్ మీడియాలో దూషణలకు దిగిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో దీనిని క్రిమినల్ కంటెంప్ట్‌గా పరిగణించి చర్య తీసుకోవాలని ఏజీ కోరారు. ప్పటికే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్రపతి కార్యాలయం..జడ్జిలపై నిందలు, కామెంట్లు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలన చీఫ్‌ సెక్రటరీని ఆదేశించిన సంగతి విదితమే.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif