State Wise Debt in India 2022: ఏపీ అప్పులు రూ.3.98 లక్షల కోట్లు, తెలుగు రాష్ట్రాలతో పాటు అన్నిరాష్ట్రాల అప్పుల వివరాలను తెలిపిన కేంద్రం, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు (Congress MP Uttam Kumar reddys Question) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా వివరాలను (Central Govt releases Debts of states) అందించారు.

Finance Nirmala Sitharaman

Hyd, July 25: రాష్ట్రాల అప్పుల వివరాలను (State Wise Debt in India 2022) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు (Congress MP Uttam Kumar reddys Question) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా వివరాలను (Central Govt releases Debts of states) అందించారు. ఇందులో దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రాలుగా తమిళనాడు, యూపీ, మధ్యప్రదేశ్ ఉన్నాయి. రూ.5 లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రంగా బెంగాల్, 4లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రాలు కర్ణాటక, గుజరాత్‌ ఉన్నాయి.

తెలంగాణ అప్పులు రూ. 3 లక్షల 12 వేల కోట్లు, సీఎం కేసీఆర్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం ఏటా మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోతోందని మండిపడిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

తమిళనాడు అప్పులు రూ.6.59 లక్షల కోట్లు కాగా..యూపీ అప్పులు రూ.6.53 లక్షల కోట్లు, మధ్యప్రదేశ్‌ అప్పులు రూ.3.17 లక్షల కోట్లు, గుజరాత్‌ అప్పులు రూ.4.02 లక్షల కోట్లు, రాజస్థాన్‌ అప్పులు రూ.4.77 లక్షల కోట్లు. బెంగాల్‌ అప్పులు రూ.5.62 లక్షల కోట్లని కేంద్రం వెల్లడించింది. తెలంగాణకు 3.12 లక్షల కోట్ల అప్పులు ఉండగా, ఏపీకి అప్పులు రూ.3.98 లక్షల కోట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు 2020లో 3 లక్షల 7వేల 671. 5 కోట్ల రుణాలు ఉన్నాయని ఆర్థికమంత్రి చెప్పారు. 2021 నాటికి ఏపీ అప్పులు 3 లక్షల 60 వేల 333. 4 కోట్లకు చేరాయన్నారు.తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి.

States Debt report 1

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పులను ఓ సారి పరిశీలిస్తే..

ఆంధ్రప్రదేశ్: 3,98,903 లక్షల కోట్లు

అరుణాచల్ ప్రదేశ్: 15, 122 వేల కోట్లు

అస్సాం: 1,07,719 లక్షల కోట్లు

బీహార్: 2,46,413 లక్షల కోట్లు

చత్తీస్‌గఢ్‌: 1,14,200 లక్షల కోట్లు

గోవా: 28,509 వేలకోట్లు

గుజరాత్: 4,02,785 లక్షల కోట్లు

హర్యానా: 2,79,022 లక్షల కోట్లు

హిమాచల్ ప్రదేశ్: 74,686 వేల కోట్లు

ఝార్ఖండ్: 1,17,789 లక్షల కోట్లు

కర్ణాటక: 4,62,832 లక్షల కోట్లు

కేరళ: 3,35,989 లక్షల కోట్లు

మధ్యప్రదేశ్: 3,17,736 లక్షల కోట్లు

మహరాష్ట్ర: 6,08,999 లక్షల కోట్లు

మణిపూర్: 13,510 వేల కోట్లు

మేఘాలయ: 15,125 వేల కోట్లు

మిజోరాం: 11,830 వేల కోట్లు

నాగాలాండ్: 15,125 వేల కోట్లు

ఒడిశా: 1,67,205 లక్షల కోట్లు

పంజాబ్: 2,82,864 లక్షల కోట్లు

రాజస్థాన్: 4,77,177 లక్షల కోట్లు

సిక్కిం: 11,285 వేల కోట్లు

తమిళనాడు: 6.59 లక్షల కోట్లు

తెలంగాణ: 3,12,191 లక్షల కోట్లు

త్రిపుర: 23,624 వేల కోట్లు

ఉత్తప్రదేశ్: 6,53,307 లక్షల కోట్లు

ఉత్తరాఖండ్: 84,288 వేల కోట్లు

వెస్ట్ బెంగాల్: 5,62,697 లక్షల కోట్లు