Telangana PCC chief Chief Uttam Kumar Reddy | (Photo Credits: ANI)

Hyd, July 25: రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర సోమవారం ప్రకటించింది. గత మూడేళ్లలో రాష్ట్రాలు తీసుకున్న అప్పుల జాబితాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రకటించారు. ఇందులో తెలంగాణ, ఏపీ అప్పులు జాబితాను విడుదల చేశారు. 2022 వరకు ఏపీ అప్పులు రూ. 3 లక్షల 98 వేల కోట్లు ఉండగా.. తెలంగాణ అప్పులు రూ. 3 లక్షల 12వేల కోట్లుగా ఉంది. 2014 నాటికి తెలంగాణ అప్పు కేవలం రూ. 64వేల కోట్లు మాత్రమే ఉంది. అయితే 2014లో రూ.18 వేలుగా ఉన్న తలసరి అప్పు.. 2022లో రూ.లక్షకు పెరిగింది.

దీనిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (TPCC president N. Uttam Kumar Reddy) మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అసమర్థ పాలన వల్ల తెలంగాణ ఏటా మరింతగా అప్పుల ఊబిలో (CM KCR has made Telangana a bankrupt) కూరుకుపోతోందని ఆయన అన్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దుతున్నారని.. సీఎం కేసీఆర్ (CM KCR) రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి సోమవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

లోక్ సభ నుంచి 4గురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్, స‌భా నిబంధ‌నావ‌ళిని ధిక్క‌రించినందుకు వ‌ర్షాకాల స‌మావేశాలు మొత్తం సస్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీకర్ ప్రకటన

ఎడాపెడా అప్పులతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారని.. కాసీ సీఎం కేసీఆర్ ఎప్పుడూ పట్టించుకోలేదని ఉత్తమ్ మండిపడ్డారు. గత ఏడాది మార్చి నాటికి తెలంగాణ అప్పులు రూ.2.67 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.3.12 లక్షల కోట్లకు చేరిందని.. ఇలా ఏటా రూ.50 వేల కోట్ల వరకు అప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అంశాల్లో అంకెలను తారుమారు చేస్తోందని, తప్పుడు వివరాలు ఇస్తోందని కాగ్‌, 15వ ఆర్థిక సంఘం తమ నివేదికల్లో అనుమానం వ్యక్తం చేశాయని గుర్తు చేశారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అప్పు రూ.69 వేల కోట్లు ఉండగా.. 2022 మార్చి 31 నాటికి రూ.3,12 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. అవసరం లేని ప్రాజెక్ట్‌లు కట్టి ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బాధాకరమన్నారు. టీఆర్ఎస్‌ అవినీతి, అసమర్థత వల్లే రాష్ట్రం దివాళా తీసే స్థితికి చేరుకుందని విమర్శించారు.