కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు లోక్ సభ నుంచి సస్పెండ్ అయ్యారు. వీరిలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌తో పాటు ఆ పార్టీ ఎంపీలు రమ్య హరిదాస్, జ్యోతి మణి, టీఎన్ ప్రతాపన్‌లు ఉన్నారు. సభా నిబంధనావళిని ధిక్కరించి సభలో వీరు వ్యవహరించారని, అందుకే వీరిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వీరిని పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోపక్క, తమ సస్పెన్షన్ తీరును నిరసిస్తూ నలుగురు ఎంపీలూ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు.
4 Congress MPs suspended for entire Monsoon session over 'unruly behaviour'
Read @ANI Story | https://t.co/BFKThevzAm#Congress #MonsoonSession #LokSabha pic.twitter.com/akZYlgGZRr
— ANI Digital (@ani_digital) July 25, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)