CM Jagan Slams TDP: దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు, సామాజిక సమతా సంకల్ప సభలో ప్రతిపక్షాలపై మండిపడిన సీఎం జగన్

ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) మండిపడ్డారు.

CM YS Jagan Mohan Reddy (Photo-Twitter/APCMO)

Vjy, Jan 19: విజయవాడ స్వరాజ్య మైదాన్‌లో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని (Statue of Social Justice Unveiled) ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాటానికి రూపమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కీర్తించారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో మాట్లాడుతూ, పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? అంటూ ప్రశ్నించారు. పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని.. ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) మండిపడ్డారు.

పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోవడం అంటరానితనమే. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే. పేదపిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమే. దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమలేదు. మన ప్రభుత్వం బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదు. అంబేద్కర్‌ భావజాలం పెత్తందారులకు నచ్చదు’’ అని సీఎం జగన్‌ దుయ్యబట్టారు.

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన అంబేద్క‌ర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌, సామాజిక న్యాయ మహా శిల్పమంటూ అభివ‌ర్ణించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్, విగ్ర‌హ ప్ర‌త్యేక‌త‌లివే!

పెత్తందారులకు దళితులంటే చులకన. పెత్తందారీ పార్టీలకు, పెత్తందారి నేతలకు పేదలు అవసరం లేదు. రియల్‌ ఎస్టేట్‌ రాజధాని కోసం పేదల భూములు లాక్కున్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే పెత్తందారుల లక్ష్యం. గతంలో చంద్రబాబు ఎందుకు బటన్‌ నొక్కలేకపోయారు. చంద్రబాబు ఎందుకు సామాజిక న్యాయం అమలు చేయలేకపోయారు’’ అంటూ సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.

సామాజిక చైతన్యవాడలా విజయవాడ కనిపిస్తోంది. స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుంది. దళితజాతికి, బహుజనులకు అభినందనలు తెలియజేస్తున్నా.. సామాజిక న్యాయ మహాశిల్పం కింద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ విగ్రహం పేదలకు, రాజ్యాంగం అనుసరించే వారికి నిరంతరం స్ఫూర్తినిస్తుంది. మరణం లేని మహానేత డా.బీఆర్‌ అంబేద్కర్‌. అందరీని ఒక్కతాటిపై నిలబెట్టామంటే అంబేద్కర్‌ స్ఫూర్తితోనే సాధ్యమైంది. అట్టడుగు వర్గాల తలరాతను మార్చిన ఘనుడు అంబేద్కర్‌’’ అని సీఎం జగన్‌ కొనియాడారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు