Food Poison in Mid-day Meal: బల్లిపడిన మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్ధులు, 51 మందికి అస్వస్థత, పలువురి పరిస్థితి విషమం, అన్నమయ్య జిల్లాలో ఘటన
సకాలంలో అస్వస్థతకు గురైన విద్యార్థులను (Students) ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో విద్యార్థులంతా కోలు కుంటున్నారు. జిల్లాలోని మదనపల్లె మండలం టేకుల పాలెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం( Midday meals) వండి పెట్టారు.
Kadapa, NOV 23: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. సకాలంలో అస్వస్థతకు గురైన విద్యార్థులను (Students) ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో విద్యార్థులంతా కోలు కుంటున్నారు. జిల్లాలోని మదనపల్లె మండలం టేకుల పాలెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం( Midday meals) వండి పెట్టారు. అయితే భోజనం బల్లి పడిన విషయం తెలియక పోవడంతో భోజనం తిన్న 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 25 మంది బాలికలున్నారు. అస్వస్థకు గురైన సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే వారిని మదనపల్లె ఆసుపత్రికి(Hospital) తరలించి చికిత్స అందజేశారు.
దీంతో విద్యార్థులు కోలుకున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీవో ఆసుపత్రిని సందర్శించి చికిత్సపొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విద్యార్థులు కోలుకుంటున్నారని ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.