AP Three Capitals: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ, హైకోర్టులో విచారణలో ఉన్నందున పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల స్టేటస్ కో అంశంపై జోక్యం చేసుకోలేమని వెల్లడి

పాలనా వికేంద్రీకరణ (Three capitals), సీఆర్డీఏ రద్దు చట్టాలపై (CRDA Repeal petition) ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ జరగ్గా.. పిటిషన్‌ను జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ , జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు (High Court) విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమంది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలిపింది.

Supreme Court | (Photo Credits: PTI)

Amaravati, August 26: మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో (Supreme Court) మరోసారి నిరాశే ఎదురయింది. పాలనా వికేంద్రీకరణ (Three capitals), సీఆర్డీఏ రద్దు చట్టాలపై (CRDA Repeal petition) ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ జరగ్గా.. పిటిషన్‌ను జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ , జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు (High Court) విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమంది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలిపింది.

హైకోర్టులో విచారణ గురువారం ఉన్నందున తమ వద్దకు రావడం సరికాదని తెలిపింది. ప్రభుత్వ వాదనలు హైకోర్టులోనే వినిపించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈకేసును హైకోర్టు త్వరగా పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం..ఆ తర్వాత జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌ ధర్మాసనం ముందుకు రాజధాని పిటిషన్ విచారణకు రాగా.. సాంకేతిక కారణాలతో మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. దీంతో బుధవారం జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ ధర్మాసనం ఈ పిటిషన్‌‌పై విచారణ జరిపింది.

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల కేసును రోజువారీ విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.వేగంగా విచారించి పరిష్కరించాలని సూచించింది.  కాగా రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అలాగే, అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. హైకోర్టు కర్నూలుకు తరలివెళ్లనుంది.



సంబంధిత వార్తలు