Supreme court: ఏపీ హైకోర్టు ఆదేశాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపిన సుప్రీంకోర్టు, ఏపీలో రాజ్యాంగ సంక్షోభంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అత్యున్నత ధర్మాసనం

విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ సంక్షోభం అంశం విచారణలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌ని విచారించిన అత్యున్నత ధర్మాససనం...ఈ వ్యాజ్యంతో ముడిపడి ఉన్న ఇతర పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను నిలిపి వేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

Supreme Court of India | Photo-IANS)

Amaravati, Dec 18: ఏపీలో ‘రాజ్యాంగ సంక్షోభం’ అయిందంటూ దాఖలు చేసిన పిటిషన్లపై అత్యున్నత ధర్మాసనం విచారణ జరిపింది. విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ సంక్షోభం అంశం విచారణలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌ని విచారించిన అత్యున్నత ధర్మాససనం...ఈ వ్యాజ్యంతో ముడిపడి ఉన్న ఇతర పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను నిలిపి వేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాక దీంతో పాటుగా హైకోర్టు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవి బెంచ్‌ ఆదేశాలు, విచారణను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ అత్యున్నత న్యాయస్థానం​ తెలిపింది. ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎస్‌ బోబ్డే స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ని వ్యతిరేకించిన న్యాయవాది సిద్దార్థ లూథ్రాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

జగనన్న అమ్మ ఒడి పథకానికి వెంటనే అప్లయ్ చేసుకోండి, 2021 జనవరి 9వ తేదీన రూ.15 వేల ఆర్థిక సాయం, డిసెంబర్ 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన

మీరు ఎన్నాళ్ల నుంచి ప్రాక్టీసు చేస్తున్నారు.. గతంలో ఇలాంటి ఆదేశాలు ఎప్పుడైనా ఇచ్చారా’ అంటూ కోర్టు సిద్దార్థ లూథ్రాను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కనీసం హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై విచారణకు అనుమతించాలన్న సిద్దార్థ లూథ్రా అభ్యర్థనని కోర్టు తిరస్కరించింది. రాజ్యంగం సంక్షోభంలో ఉందనే భావనతో జడ్జి ప్రభావితం అయినందున అన్ని విచారణలపైన స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది. సెలవుల తర్వాత తదుపరి విచారణ చేస్తామని తెలిపింది.

ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, జగనన్న అమ్మ ఒడి పథకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశం, పలు కీలక అంశాలను చర్చించనున్న మంత్రివర్గం

హైకోర్టు మధ్యంతర ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబర్ 1న హైకోర్టు ఆదేశమివ్వగా.. ఆదేశాలు వెనక్కి తీసుకోవాలన్న ఏపీ అభ్యర్థనను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకునే (రీకాల్‌) ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసంన దీనిపై స్టే విధించింది.