YS Jagan Disproportionate Assets Case: జగన్ అక్రమాస్తుల కేసు, సీబీఐకి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసులో ఎంపీ రఘురామకు సంబంధం ఏమిటని సూటి ప్రశ్న

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై రెబల్ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.కేసు విచారణలో జాప్యం జరుగుతోందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

Supreme Court of India (File Photo)

Vjy, Nov 3: ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై రెబల్ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.కేసు విచారణలో జాప్యం జరుగుతోందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్వీఎన్ భట్టిల ధర్మాసనం విచారించింది.

ఈ కేసు విచారించిన ధర్మాసం సీబీఐకి నోటీసులు జారీ చేసింది.కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని ప్రశ్నించింది. రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, సహా ప్రతివాదులుగా ఉన్న అరబిందో, హెటిరో గ్రూప్‌, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.నిత్యానందరెడ్డి, పి.శరత్‌చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, యద్దనపూడి విజయలక్ష్మి, పీఎస్‌ చంద్రమౌళి, జగతి పబ్లికేషన్స్‌, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసింది.

చంద్రబాబు మద్యంతర బెయిల్‌పై ఏపీ హైకోర్టు తాజా తీర్పు, డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన తిరస్కరణ, గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగింపు

తెలంగాణ సీబీఐ కోర్టులో (Telangana CBI Court) జగన్ కేసులపై విపరీతమైన జాప్యం జరుగుతోందని.. 3041 సార్లు జగన్ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్ ప్రత్యక్ష హాజరుకు కూడా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. వందల కొద్ది డిశ్చార్జి పిటీషన్లు వేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

కరువును తరిమి కొట్టడానికి ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం, నీటి పారుదల రంగంపై సదస్సులో సీఎం జగన్, ఇంకా ఏమన్నారంటే..

రఘురామ పిటిషన్‌పై సుప్రీం పలు ప్రశ్నలు సంధించింది. జగన్ అక్రమాస్తుల కేసుకు ఎంపీ రఘురామకు ఏమిటి సంబంధమని కోర్టు ప్రశ్నించారు. ఎంపీ రఘురామ ఫిర్యాదుదారు కాదని.. బాధితుడు కూడా కానప్పుడు ఆయనెందుకు పిటీషన్ వేశారని సుప్రీం ధర్మాసనం అడిగింది. ఫిర్యాదుదారు కానప్పటికీ పిటీషన్ దాఖలు చేయవచ్చని ఎంపీ రఘురామ తరపు సీనియర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే మూడో వ్యక్తి ఎందుకు పిటిషన్ వేశారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా అని కోర్టు అడుగగా.. ఎంపీ రఘురామ కూడా వైసీపీ ఎంపీనే అని ఎంపీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు.



సంబంధిత వార్తలు

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif