Three Senior IPS Suspended in AP: బాలీవుడ్ న‌టి కేసులో కీల‌క ప‌రిణామం, ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌పై వేటు వేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం, వైసీపీ నేత‌తో క‌లిసి వేధించార‌ని ఫిర్యాదు

ఇప్పటికే ఈ కేసులో విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణపై ఉన్నతాధికారులు వేటు వేశారు.

Three Senior IPS Suspended in AP (PICS @ X)

Vijayawada, SEP 15: ఏపీలో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం సస్పెన్షన్‌ చేసింది. ముంబై నటి కాదంబరి జెత్వాని (Kadambari Jatwani) పై అక్రమంగా పెట్టిన కేసులో ముగ్గురు ఐపీఎస్‌(IPS) అధికారులు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్దారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు(PSR Anjaneyulu) , విజయవాడ మాజీ సీపీ కాంతారాణా టాటా (Kanthi rana Tata) , విశాల్‌ గున్ని (Vishal gunni) ని సస్పెండ్‌ చేస్తూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణపై ఉన్నతాధికారులు వేటు వేశారు.

Whiskey In Ice Cream Case: లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపిన ఎక్సైజ్ పోలీసులు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఓనర్! 

వైసీపీ హయాంలో ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తతో కాదంబరి జత్వానికి మధ్య జరిగిన వివాదం పంచాయతీ ఏపీలోని వైసీపీ కీలక నేత వద్దకు వచ్చింది. దీంతో ఆ కీలకనేత పారిశ్రామికవేత్తతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అతడిని కాపాడేందుకు పోలీసుల బాస్‌లను ఉపయోగించాడు. దీంతో పోలీసు అధికారులు జత్వానిపై అక్రమంగ కేసులు పెట్టి తల్లిదండ్రులతో పాటు ఆమెను జైలులో ఉంచారు.

Jagan On Chandrababu: ప్రజారోగ్యంపై టీడీపీ ప్రభుత్వ విధానం ఇదేనా?, ఎంబీబీఎస్ సీట్లు వద్దంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడంపై జగన్ ఫైర్, ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక 

అనంతరం ఆమెను బెదిరించి సంతకాలు తీసుకుని కేసును సెటిల్‌మెంట్‌ చేశారు. అనంతరం ఏపీలో ఎన్నికలు జరుగడం వైసీపీ అధికారం కోల్పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నటి జత్వాని కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో ముఖ్యమంత్రి స్పందించి విచారణ ఆదేశించడంతో పాటు విచారణ కమిటీని నియమించి వారి నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఐపీఎస్‌లను సస్పెన్షన్‌ చేసింది.