Big Twist on whiskey in ice cream case...Here is the full details!

కొద్ది రోజుల క్రితం ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి అమ్ముతున్నారని ఓ షాపుపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బిగ్ ట్విస్ట్.

లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీని ఎక్సైజ్ పోలీసులే కలిపారని ఉన్నతాధికారులకు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి.  అక్క‌డ అమ్మేది చాకొలెట్ ఐస్ క్రీం కాదు, విస్కీ ఐస్ క్రీం! జూబ్లీహిల్స్ లో ముఠా అరెస్ట్, పార్టీ ఆర్డ‌ర్ కోసం ఏకంగా 23 కేజీలు రెడీ చేసిన అరికో కెఫే 

Here's Tweet:

హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులకు లంచం ఇవ్వని అరికో కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డిని ఇరికించాలని చూశారు ఎక్సైజ్ పోలీసులు. డెకాయ్‌ ద్వారా పదకొండున్నర కిలోల కేక్ ఆర్డర్ చేయించారు ఎక్సైజ్ పోలీసులు.

ఆన్‌లైన్ ద్వారా నగదు పంపించి.. విస్కీ బాటిక్ కొని కేక్‌లో కలపాలని చెఫ్ దయాకర్‌కు చెప్పారు అధికారులు. దయాకర్ కుదరదని చెప్పడంతో వాచ్‌మన్ తాగి పడేసిన మందు బాటిళ్లు లోనికి తీసుకొచ్చి.. రైడ్ చేసినట్టు డ్రామాలు ఆడారు అధికారులు. ఆలస్యంగా నిజం బయటకు వచ్చింది.