Officials along with seized items by the Excise Department (Photo Credits: X/ANI)

Hyderabad, SEP 07:  .పోలీసుల నిఘా పెరగడంతో మత్తుగాళ్లు కొత్త దారులు (Drugs) వెత్తుక్కుంటున్నారు. చివరికి చిన్న పిల్లలు ఎక్కువగాతినే ఐస్ క్రీములను తమ దందాకు వాడుకుంటున్నారు. హైదరాబాద్ లో ఐస్ క్రీముల్లో విస్కీ (Whiskey Ice Cream) కలిపి విక్రయిస్తున్న మత్తుదందా గుట్టురట్టయింది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించి.. ఓ ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి 11.5 కిలోల విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ బాక్సులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Whiskey Ice Cream Racket Busted 

 

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ వన్ అండ్ ఫైవ్ లోని హరికే కేఫ్ (Ariko Cafe) ఐస్ క్రీమ్ పార్లర్ షాపులో విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు (Whiskey Ice Cream Racket) సాగిస్తున్నారు. ఒక కేజీ ఐస్ క్రీమ్ లో 60మి.లీ 100 పైపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. మరో అడుగు ముందుకు వేసిన ఐస్ క్రీమ్ తయారీదారులు.. వాటిని ఫేస్ బుక్ లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఐస్ క్రీమ్ పార్లర్ లో తనిఖీలు నిర్వహించిన ఎక్సైస్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు 11.5 కేజీల విస్కీ కలిపిన ఐస్ క్రీములను స్వాధీనం చేసుకున్నారు.

Fire Accident At Hyderabad: హైదరాబాద్ మల్లాపూర్‌లో అగ్నిప్రమాదం, ఓ కంపెనీలో చెలరేగిన మంటలు..వీడియో 

ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎస్టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు ఆధ్వర్యంలో బృందం ఈ దాడులు నిర్వహించింది. విస్కీతో ఐస్ క్రీమ్ లను తయారు చేసిన వ్యక్తుల్లో దయాకర్ రెడ్డి, శోభన్ లు ఉన్నారు. ఈ ఐస్ క్రీమ్ పార్లర్ ను శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి నడిపిస్తున్నారు. దీంతో పోలీసులు తయారీ, విక్రయదారులపై కేసు నమోదు చేశారు. చిన్న పిల్లలే టార్గెట్ గా విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 100 పైపర్ విస్కీ కలిపి ఎక్కువ రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.