Swarna Palace Fire: రమేష్‌ ఆస్పత్రి నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించింది, అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వానికి రిపోర్టును అందజేసిన విచారణ కమిటి, రిపోర్టులోని కీ పాయింట్స్ కథనంలో..

ఈ రిపోర్టులో రమేష్‌ ఆస్పత్రి (Ramesh Hospitals) అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధలను పూర్తిగా ఉల్లంఘించించిందని తెలిపింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా చట్టాలను పట్టించుకోకుండా 10 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని స్పష్టం చేసింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జారీచేసిన అనుమతుల్లో నియమాలను ఉల్లంఘించి, కోవిడ్‌ అనుమానితులతో పాటుగా వైరస్‌ సోకని వారిని కూడా ఆస్పత్రిలో చేర్చుకున్నారని పేర్కొంది. ప్రభుత్వం ఇస్తున్న నిబంధనలను పట్టించుకోలేదని ప్రభుత్వ అనుమతులు రాకముందే.. హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లో (Swarna Palace) కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు తేల్చిచెప్పింది.

Swarna Palace Fire Accident (Photo-ANI)

Amaravati. August 19: విజయవాడ స్వర్ణప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కమిటి (investigative committee) ప్రభుత్వానికి నివేదికను అందించింది. ఈ రిపోర్టులో రమేష్‌ ఆస్పత్రి (Ramesh Hospitals) అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధలను పూర్తిగా ఉల్లంఘించించిందని తెలిపింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా చట్టాలను పట్టించుకోకుండా 10 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని స్పష్టం చేసింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జారీచేసిన అనుమతుల్లో నియమాలను ఉల్లంఘించి, కోవిడ్‌ అనుమానితులతో పాటుగా వైరస్‌ సోకని వారిని కూడా ఆస్పత్రిలో చేర్చుకున్నారని పేర్కొంది. ప్రభుత్వం ఇస్తున్న నిబంధనలను పట్టించుకోలేదని ప్రభుత్వ అనుమతులు రాకముందే.. హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లో (Swarna Palace) కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు తేల్చిచెప్పింది.

సదరు హోటల్‌లో అగ్నిమాపక భద్రతా నియమాలు ఉన్నాయా? లేవా? అనేది చూసుకోకుండానే పేషెంట్లను తరలించిందని తెలిపింది. కాగా స్వర్ణప్యాలెస్‌ ఘటనపై (Swarna Palace Fire) కృష్ణా జేసీ, విజయవాడ సబ్‌కలెక్టర్, సీఎంహెచ్‌ఓ, రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్, ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌లతో కూడిన విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు జరిపింది. కోవిడ్‌ చికిత్స ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ.. అవసరం ఉన్నా, లేకున్నా ఖరీదైన రెమ్‌డెసివర్‌ అన్ని కేటగిరీల పేషెంట్లకూ వాడారని తెలిపింది. రాజధాని అంశం అసలు మా పరిధిలో లేనే లేదు, హైకోర్టు నోటీసులపై మరోసారి స్పందించిన కేంద్రం, మూడు రాజధానుల అంశం మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు

ఎం–5, మెట్రోపాలిటిన్‌ హోటళ్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే కోవిడ్‌ కేర్‌ సెంటర్లను రమేశ్‌ ఆస్పత్రి నిర్వహించిందని పేర్కొంది. అగ్ని ప్రమాదాలను నివారించే పరికరాలు గాని, నిరభ్యంతర పత్రంగాని, అలాగే ప్రమాదాలు వచ్చినప్పుడు నివారించే వ్యవస్థలుగాని స్వర్ణప్యాలెస్‌లో లేవని తెలిపింది. గత పన్నెండున్నర సంవత్సరాలుగా 19.4 మీటర్ల ఎత్తులో, అత్యంత రద్దీ ప్రదేశంలో ఈ హోటల్‌ కొనసాగుతోంది. ప్రభుత్వ నియమాలను, నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుపుతున్నారు. బిల్డింగుకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కూడా లేదని రిపోర్టులో తెలిపింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కట్టాల్సిన రూ.33.69లక్షల పన్ను బకాయిలు కూడా కట్టలేదని తెలిపింది.



సంబంధిత వార్తలు

Jagan Slams Chandrababu Govt: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం, బురద జల్లుతూ రాతలు రాయడంపై మండిపడిన జగన్, ఇంకా ఏమన్నారంటే..

Nara Lokesh Key Comments: ఏపీలో ఇక‌పై వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు క‌ట్, కేబినెట్ స‌బ్ క‌మిటీలో కీల‌క నిర్ణ‌యం, ప్ర‌తిపాదించిన నారా లోకేష్

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్