Tadepalli Rape Case: కాబోయే భర్త ముందే యువతిపై సామూహిక అత్యాచారం, తాడేపల్లి అత్యాచార ఘటనలో నిందితులని అరెస్ట్ చేసిన పోలీసులు, మీడియాకు వివరాలను వెల్లడించిన ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌

నిందితుల నుంచి సెల్‌ఫోన్లను తాకట్టు పెట్టుకున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.

Two men held for rape of a woman at Seethanagaram ghat (Photo-Twitter)

Amaravati, August 8: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద యువతిపై లైంగికదాడి (Tadepalli Rape Case) చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుల్లో ఇద్దరిని అర్బన్‌ పోలీసులు అరెస్టుచేశారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్లను తాకట్టు పెట్టుకున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో శనివారం ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.

కృష్ణానదీ తీరంలోని సీతానగరం పుష్కరఘాట్‌ సమీపంలో జూన్‌ 19న ఎస్సీ యువతిపై సామూహిక అత్యాచారానికి (Seethanagaram rape case) పాల్పడిన విషయం విదితమే. కాబోయే భర్తతో కలిసి విహారం కోసం నదీ తీరానికి వచ్చిన యువతిని చంపేస్తామని బెదిరించి సామూహిక అత్యాచారానికి నిందితులు పాల్పడ్డారు. అప్పటి నుంచి 3 రాష్ట్రాల పరిధిలో రోజుకో చోటకు మకాం మారుస్తూ 50 రోజులపాటు దర్యాప్తు బృందాలను ముప్పుతిప్పలు పెట్టారు. చివరికి వారిలో ఒకడు పట్టుబడగా, రెండో నిందితుడు రామలింగం వెంకటప్రసన్నరెడ్డి అలియాస్‌ వెంకటరెడ్డి పరారీలో ఉన్నాడని తెలిపారు.

తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌కు చెందిన కృష్ణకిశోర్‌ సీలింగు వర్కులు, అలాగే.. మహానాడు ప్రాంతానికి చెందిన ప్రసన్నరెడ్డి అలియాస్‌ వెంకటరెడ్డి కబోర్డు పనులు చేసుకుంటుంటారు. గత జూన్‌ 19 రాత్రి వీరిద్దరూ సీతానగరం రైల్వే బ్రిడ్జిపై కాపర్‌ వైర్లు దొంగతనం చేశారు. దానిని చూసిన వ్యక్తిని అక్కడే హత్యచేసి మృతదేహాన్ని నదిలోకి తోసేసి ఇసుకలో నడుచుకుని వెళ్తున్నారు. అదే సమయంలో పుష్కర్‌ఘాట్‌ వద్ద ఓ యువతి, ఆమె స్నేహితుడు వారికి కనిపించారు.

కడపలో విషాదం, వెలిగల్లు ప్రాజెక్టు దగ్గర నీటిలో మునిగి నలుగురు గల్లంతు, రాత్రి 9 గంటలకు మృతదేహాలను వెలికితీసిన పోలీస్ సిబ్బంది, మృతులంతా బెంగుళూరు వాసులు

మద్యం మత్తులో ఉన్న నిందితులిద్దరూ వారిని తాళ్లతో కట్టేసి యువతిపై లైంగికదాడి చేశారు. అదే సమయంలో రైల్లో శనక్కాయలు అమ్ముకునే ఓ వ్యక్తి అక్కడ రైలు దిగినప్పుడు వీరిద్దరూ చోరీ చేస్తూ కనిపించారు. ఆయన పోలీసులకు చెబుతారేమోనన్న అనుమానంతో కాళ్లు చేతులు కట్టేసి మెడకు రాగి తీగలతో ఉరి బిగించి చంపేశారు. మృతదేహాన్ని కృష్ణా నదిలోకి పడేశారు. తర్వాత ఇసుక తిన్నెలపై మద్యం సేవించారు.

Here's GUNTUR URBAN POLICE Tweet

అదే సమయంలో కాబోయే భర్తతో కలిసి అక్కడ విహారానికి వచ్చిన యువతిని, ఆమె కాబోయే భర్తను బ్లేడ్లు చూపించి బెదిరించారు. వారి దుస్తులను విప్పించి వాటితో వారిని కట్టేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వారిద్దరి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. నదీతీరంలో ఉన్న పడవపై విజయవాడ వైపు పరారయ్యారు. అక్కడ రాణిగారితోట సమీపంలోని నదీతీరంలో రాత్రంతా నిద్రించారు. మరుసటిరోజు తాడేపల్లి వచ్చి వారు దోచుకున్న సెల్‌ఫోన్లను షేక్‌హబీబ్‌ అలియాస్‌ హన్నీ గుండు వద్ద తాకట్టు పెట్టారు.

తల్లి వెంట అడవికి వెళ్లిన బాలికపై విరుచుకుపడిన కామాంధులు, రేప్ చేసి చెట్టుకు ఉరేసి చంపేశారు, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని విదిషా జిల్లాలో అమానుష ఘటన

అక్కడి నుంచి ఇద్దరూ ఒంగోలు వెళ్లారు. అనంతరం కృష్ణకిశోర్‌ హుబ్లీ, నిర్మల్, బైంసా ఆ తర్వాత సికింద్రాబాద్‌లో తిరిగాడు. తన తల్లిని చూసేందుకు ఇటీవల విజయవాడ చేరుకున్న క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలకు వెళ్లి గాలించారు. నిందితులు కొన్నిచోట్ల అడుక్కుంటూ, కొన్ని ప్రాంతాలలో ఖాళీ సీసాలు అమ్ముకుని బతుకుతుండగా పోలీసులు వీరి కోసం ఆయా వేషాలతో జల్లెడ పట్టారు. చివరకు కృష్ణకిషోర్‌ను అరెస్టుచేశారు. నిందితుల్ని (Two men held for rape of a woman) పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ హఫీజ్‌ అభినందించారు. కాగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సమోసాలు విక్రయించే వారిగా, చిత్తు కాగితాలు ఏరుకునే వారిగా మారువేషాలు వేశారు.