Image used for representational purpose only | File Photo

YSR Kadapa, August 8: ఏపీలో స్నేహితుల విహార యాత్ర విషాదకరంగా ముగిసింది. బెంగళూరుకు చెందిన నలుగురు సరదాగా ఈత కొడుతూ నీటిలో మునిగి మృత్యువాత (Veligallu Project Tragedy) పడిన సంఘటన శనివారం వైఎస్సార్ కడప జిల్లా గాలివీడు మండల కేంద్రానికి సమీపంలోని వైఎస్సార్‌ వెలిగల్లు ప్రాజెక్టు దిగువనున్న గండిమడుగులో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన దాదాపు 20 మంది కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లా వాయల్పాడులోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాసేపు సరదా కోసం వెలిగల్లు ప్రాజెక్టు వద్దకు (Andhra Pradesh Veligallu project) వచ్చారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం సమీపంలోని మడుగులో ఈత కోసం దిగారు. ఈత కొట్టాలని దిగిన తాజ్‌ మహమ్మద్‌(41), ఉస్మాఖానం (12), మహమ్మద్‌ హంజా(11), మహమ్మద్‌ ఫహాద్‌(10)లు ఒక్కసారిగా గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. లక్కిరెడ్డిపల్లి సీఐ యుగంధర్, ఎస్‌ఐ చిన్నపెద్దయ్య, ఫైర్‌ సిబ్బంది ముమ్మరంగా గాలించి రాత్రి 9 గంటలకు మృతదేహాలను వెలికితీశారు.

తల్లి వెంట అడవికి వెళ్లిన బాలికపై విరుచుకుపడిన కామాంధులు, రేప్ చేసి చెట్టుకు ఉరేసి చంపేశారు, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని విదిషా జిల్లాలో అమానుష ఘటన

ఇక రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఎస్. ఆర్ ఎనక్లేవ్ అపార్ట్‌మెంట్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నడింపల్లి నరసింహారాజు, వెంకటరమణమ్మగా పోలీసులు గుర్తించారు. భర్త నిడదవోలులో టీచర్ కాగా, భార్య ఉమెన్స్ కాలేజ్లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పని చేస్తోంది. కుటుంబకలహాలే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.